ANKURARPANAM OF NARAYANAVANAM KV TEMPLE BTU_ నారాయణవనం శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
Tirupati, 26 May 2018: The Annual Brahmotsavam of Sri Kalyana Venakteswara swamy of Narayanavanam kicked off with Ankurarpanam on Saturday evening.
The sacred ritual of Ankurarpanam was performed after chanting of Vedic hymns by Agama pundits with Vishwaroopa Darshan in morning, Mrutsyam graham and Senapati utsavam.
As part of the nine day annual event Dwajarohanam and Pedda Sesha Vahanam will be performed on May 27, Garuda Vahanam on May 31, Rathotsavam and Kalyanotsavam on June 3, Chakrasnanam and Dwajaavarohanam on June 4.
The Utsava idols will be paraded on different decorations and vahanams every day in the morning and evening Devotees could participate in the Kalyanotsavam by payment of Rs.750 per couple and beget one uttarium, one blouse, one laddu and one vada.
The artisans of TTD cultural wings of HDPP, Annamacharya Project will perform Bhakti sangeet, Religious discourses, bhajans etc every day in front of the vahanams and also later in the temple premises.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
నారాయణవనం శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
తిరుపతి, 2018, మే 26: నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శనివారం సాయంత్రం వైభవంగా అంకురార్పణ జరుగనుంది.
అంకురార్పణం సందర్భంగా శనివారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి విశ్వరూప దర్శనం కల్పించారు. రాత్రి 7.30 నుండి 9.30 గంటల వరకు మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహిస్తారు.
మే 27న ధ్వజారోహనం :
నారాయణవనంలోని శ్రీకాల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం ఉదయం 7.30 నుండి 9.00 గంటల వరకు ఆగమోక్తంగా ధ్వజారోహణం జరుగనుంది. బ్రహ్మోత్సవాలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం రాత్రి
27-05-2018(ఆదివారం) ధ్వజారోహణం (మిధునలగ్నం) పెద్దశేష వాహనం
28-05-2018(సోమవారం) చిన్నశేష వాహనం హంస వాహనం
29-05-2018(మంగళవారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
30-05-2018(బుధవారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
31-05-2018(గురువారం) పల్లకి ఉత్సవం(మోహినీ అవతారం) గరుడ వాహనం
01-06-2018(శుక్రవారం) హనుమంత వాహనం గజ వాహనం
02-06-2018(శనివారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
03-06-2018(ఆదివారం) రథోత్సవం కల్యాణోత్సవం, అశ్వవాహనం
04-06-2018(సోమవారం) చక్రస్నానం ధ్వజావరోహణం
ప్రతి రోజు ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 8.00 నుండి 10.00 గంటల వరకు స్వామివారు వివిధ వాహనాలపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. జూన్ 3వ తేదీ రాత్రి 7.30 నుండి 9.00 గంటల వరకు స్వామి, అమ్మవార్ల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. గృహస్తులు (ఇద్దరు) రూ.750/- చెల్లించి కళ్యాణోత్సవంలో పాల్గొనవచ్చును. వీరికి ఒక ఉత్తరీయం, రవిక, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందిస్తారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు అధ్వార్యంలో ప్రతి రోజు సాయంకాలం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు ఆధ్యాత్మిక, భక్తి సంగీతం, భజల కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.