LORD GOVINDRAJA RIDES ON SURYAPRABHA VAHANAM _ సూర్యప్రభ వాహనంపై గోవిందరాజస్వామి కటాక్షం

Tirupati, 27 May,2018 : On the seventh day of ongoing Brahmotsavam of Sri Govindaraja Swamy Temple Lord Govindaraja blessed the devotees by riding on Suryaprabha vahanam on Sunday morning. The event was marked by teeming devotees, bhajans, kolatas and holy music as devotees vyed with each other to offer harati to their beloved diety.

Sun god, is a fountain head of energy and the key element of nature as he provided critical support to plant life and also human beings and it was befitting that Lord rode on such a dynamic force as his vehicle.

Later in the morning Snapana Thirumanjanam was performed to the utsava idols with milk, honey, curd, coconut water, sandal paste etc. In the evening Unjal seva was performed and the idols would be brought to Kalnayana mandapam and later return after the ritual of ‘terachupu’.

Chandraprabha vahanam will be conducted in the evening. Chandra Moon God is source of medication in the universe and hence is also a vehicle of Lord.

The sacred event of Rathotsavam will be conducted tomorrow, Monday morning, Day 8 of Brahmotsavam when the Lord will adorn the Ratham on Meena lagnam at 2.45AM. Later in the evening the Lord will ride on Aswa Vahanam.

Pontifs Sri Sri Sri Pedda Jeeyar Swamy, Sri Sri Sri Chinna Jeeyar Swamy, local temples DyEO Smt Varalakshmi, AEO Sri Udayabhaskar Reddy, Supdt Sri Jnana Prakash and other temple officials and devotees participated in the grand Brahmotsavam events through out the day.

Cultural programs:

There has been tremendous response for cultural, sangeet and dharmic programs held as part of the ongoing Brahmotsavam of Sri Govindaraja Swamy Temple.

In the early hours the artisans of SV Music and Dance college presented Mangala dwani. Later the Smt P. Parvati troupe of Tirupati rendered Vishnu Sahasranamam.

Later in the evening during Unjal seva Smt Pavani Vishnatham team rendered bhakti sangeet. Later the artisans Smt Lalita Shiva Jyoti endered bhakti sangeet the pushkarini at the Sri Govindaraja Temple. The duo Dr Chakravarti Ranganatham and Sri K Rajagopalan rendered harikatha Upanyasam at Annamacharya Kalamandir.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సూర్యప్రభ వాహనంపై గోవిందరాజస్వామి కటాక్షం

తిరుపతి, 2018 మే 27 ;తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన ఆదివారం ఉదయం గోవిందరాజస్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. ఉదయం 7.00 నుండి 8.30 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, మంంగళవాయిద్యాల నడుమ వాహన సేవ సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

సూర్యుడు తేజోనిధి, సకలరోగ నివారకుడు, ప్రకృతికి చైతన్యప్రధాత. వర్షాలు, వాటివల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఓషధులు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. అట్టి సూర్యప్రభను అధిష్టించి స్వామి ఊరేగడం ఆనందదాయకం.

అనంతరం ఉదయం 9.30 నుండి 11.00 గంటల వరకు శ్రీభు సమేత గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, చందనంలతో అభిషేకం చేశారు. సాయంత్రం 6.00 నుండి 6.30 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరుగనుంది. అనంతరం శ్రీవారు కల్యాణకట్ట మండపానికి స్వామివారు వేంచేస్తారు. అక్కడ తేరుచూపు చూసి తిరిగి వాహనమండపానికి వేంచేస్తారు.

చంద్రప్రభ వాహనం:

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి 8.00 నుండి 9.30 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఓషధీశుడైన చంద్రుడు మనకు పోషకుడే. రసస్వరూపుడైన చంద్రుడై భగవానుడు ఔషధులను పోషిస్తున్నాడు. ఆ ఔషధులు లేకపోతే జీవనం మనకు లేదు. చంద్రుని వల్ల ఆనందం, చల్లదనం కలుగుతుంది. అందుకే స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను ఆహ్లాదపరుస్తాడు.

మే 28న రథోత్సవం

శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన సోమవారం రథోత్సవం వైభవంగా జరుగనుంది. తెల్లవారుఝామున 2.45 గంటలకు మీనలగ్నంలో స్వామివారు రథారోహణం చేస్తారు. ఉదయం 7.00 గంటల నుండి రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 8.00 నుండి 9.30 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ షడగోప రామానుజ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్‌స్వామి, టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమతి వరలక్ష్మి, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఉదయభాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ జ్ఞానప్రకాష్‌ ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సాంస్కృతిక కార్యక్రమాలు

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో ఆదివారం ఆలయంలో ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు ఎస్‌.వి.సంగీత, నృత్య కళాశాల వారిచే మంగళధ్వని, ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి పి.పార్వతి బృందం విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు.

సాయంత్రం 5.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవలో భాగంగా బెంగుళూరుకు చెందిన శ్రీమతి పావని కాశీవిశ్వనాథ బృందం భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి. శ్రీగోవిందరాజస్వామి పుష్కరిణి వద్ద సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి లలిత శివజ్యోతి బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించనున్నారు. అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన డా|| చక్రవర్తి రంగనాథం, శ్రీ కె.రాజగోపాలన్‌ ‘ధార్మిక ఉపన్యాసం’ ఇవ్వనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.