HIGHLIGHTS OF DIAL YOUR EO PROGRAMME_ డయల్‌ యువర్‌ ఈవో ముఖ్యాంశాలు

Tirumala, 1 June 2018: TTD Executive Officer Sri Anil Kumar Singhal said today that keeping in view of the huge number of visitors to Tirumala, the TTD has decided to issue certain quantum of tokens for Time slotted Sarva Darshan.

Addressing newspersons after the monthly Dial Your EO program at the Annamaiah Bhavan on Friday, he said on Saturday and Sunday 30,000 tokens will be issued and On Monday and Friday 20,000 and on Tuesday, Wednesday and Thursdays 17,000 tokens will be issued for time slotted Sarva darshan to pilgrims.

He said additional food counters were set up at ANC and HVC sub inquiry offices and nearly 10,000 devotees were served. He urged the devotees to take full advantage of the food counters, which were already functioning at CRO and PAC-1 where devotees were served snacks, milk and also anna prasadams.

He said during the summer months daily 2.30lakh anna prasadam servings were done- 70,000 in the VQC complex 60-70,000 (even touching the One lakh mark on Sat, Sunday and holidays) at Tarigonda Vengamamba Bhavan, and 10,000 at PAC-2.

SUBHAPRADHAM: TTD has launched the Subhapradam program to spread awareness on Hindu Sanatana Dharma practices and traditions among students of 7,8.9 standards. As part of the program, 3348 students of 7 educational institutions of TTD in AP and Telangana have imparted training.

The EO said in the month of May a record 26.54-lakh devotees had darshan of Lord Venkateswara as against 24.55 lakhs in May 2017. Similarly 1.07 crore laddus were sold this May as against 1.05 lakh laddus last year it period. Totally 70.83 lakh devotees were provided anna prasadam this year as against 70 lakh the last summer. T he Hundi collected had touched Rs. 86.46 crore his May as against Rs.78.47 crore last year.

In the same period 5.36 lakh walkers were provided Divya Darshanam and 5.56 lakh given Sara darshan tokens, 5.14 lakh given special darshan (Rs.300 tickets), Sarva darshan without tokens 5.15 lakhs, challenged, aged, infants number was 55,000 and 27,000 to others through superteam route.

Tirumala JEO Sri KS Sreenivasa Raju, Tirupati JEO Sri Pola Bhaskar, in charge CVSO Sri SivaKumar Reddy, SVBC in charge CEO Sri Mukhteswar Rao, Chief Engineer Sri Chandrasekhar Reddy, Spl Officer Annaprasadam Sri Venugopal and others participated in the program.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

డయల్‌ యువర్‌ ఈవో ముఖ్యాంశాలు

జూన్‌ 01, తిరుమల 2018: తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో ముందుగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ భక్తులను ఉద్దేశించి ప్రగించారు. ఆ వివరాలు.

నిర్ణీత సంఖ్యలో సర్వదర్శనం టోకెన్లు : ఎక్కువ మంది భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల, తిరుపతిలోని కౌంటర్లలో నిర్ణీత సంఖ్యలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నాం. శని, ఆదివారాల్లో 30 వేల టోకెన్లు, సోమ, శుక్రవారాల్లో 20 వేల టోకెన్లు, మంగళ, బుధ, గురువారాల్లో 17 వేల టోకెన్లు జారీ చేస్తున్నాం.

అదనంగా ఫుడ్‌కౌంటర్లు : తిరుమలలోని ఏ.ఎన్‌.సి, హెచ్‌.వి.సి ఉప విచారణ కార్యాలయాల వద్ద జనతా క్యాంటీన్ల స్థానంలో ఫుడ్‌ కౌంటర్లను ప్రారంభించి రోజుకు 10 వేల మందికి పైగా అన్నప్రసాదాలు అందిస్తున్నాం. ఇప్పటికే రాంభగీచా బస్టాండు, కేంద్రీయ విచారణ కార్యాలయం, పిఏసి-1 ప్రాంతాల్లో ఫుడ్‌ కౌంటర్లు ఏర్పాటుచేసి భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు అందిస్తున్నాం. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం.

ఒక రోజుకు 2.30 లక్షల అన్నప్రసాదాల వడ్డన(సర్వింగ్‌): ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా భక్తులు తరలివస్తున్నారు. ఒక రోజుకు 2.30 లక్షల అన్నప్రసాదాల వడ్డన(సర్వింగ్స్‌) జరుగుతోంది. ఇందులో.. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలో – 70 వేలు, తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో సాధారణ రోజుల్లో – 60 వేల నుండి 70 వేల వరకు, వేసవి సెలవుల్లో శని, ఆదివారాల్లో – రోజుకు ఒక లక్ష, పిఏసి-2లో – 10 వేలు సర్వింగ్స్‌ చేస్తున్నాం.

శుభప్రదం : భారతీయ సనాతన ధర్మంలోని మానవీయ నైతిక విలువలు, ఆర్ష ధర్మాలపై అవగాహన కల్పించి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉన్నతాశయంతో 7, 8, 9 తరగతుల విద్యార్థులకు మే 25న ప్రారంభించిన శుభప్రదం శిక్షణ తరగతులు నేటితో ముగియనున్నాయి. తిరుపతిలో టిటిడికి చెందిన 7 విద్యాసంస్థల్లో నిర్వహించిన ఈ తరగతుల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుండి 3,348 మంది విద్యార్థిని విద్యార్థులు శిక్షణ పొందారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గతేడాది మేలో 26.54 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, ఈ ఏడాది మేలో 24.55 లక్షల మంది దర్శించుకున్నట్టు తెలిపారు. గతేడాది మేలో ఒక కోటి 7 లక్షల లడ్డూలను భక్తులకు అందించగా, ఈ ఏడాది మేలో ఒక కోటి 5 లక్షల లడ్డూలను అందించడం జరిగిందన్నారు. గతేడాది మేలో 70 లక్షల మందికి అన్నప్రసాదాలు అందించగా, ఈ ఏడాది మేలో 70.83 లక్షల మందికి అందించామన్నారు. గతేడాది మేలో రూ.78.47 కోట్ల హుండీ ఆదాయం లభించగా, ఈ ఏడాది మే నెలలో రూ.86.46 కోట్లు లభించిందన్నారు.

2018 మే నెలలో దివ్యదర్శనం ద్వారా 5.36 లక్షల మంది, సర్వదర్శనం టోకెన్ల ద్వారా 5.56 లక్షల మంది, ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా 5.14 లక్షల మంది, సర్వదర్శనం ద్వారా 5.15 లక్షల మంది, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లలు 55 వేల మంది, సుపథం మార్గం ద్వారా 22 వేల మంది శ్రీవారిని దర్శించుకున్నారని ఈవో తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, ఇన్‌చార్జి సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎస్వీబీసీ ఇన్‌చార్జి సిఈవో శ్రీఎన్‌.ముక్తేశ్వరరావు, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.