“SAMSKRITAM NERCHUKUNDAM” GETS PILGRIM ACCOLADES_ ఆన్‌లైన్‌లో 49,060 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల :’డయల్‌ యువర్‌ ఈవో’లో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

INTRODUCE DRESSCODE FOR SVBC EMPLOYEES

Tirumala, 1 June 2018: The pilgrim callers during monthly Dial your EO program poured in laurels on Samskritam Nerchkundam program being released in TTD’s SVBC channel.

Sri Seshadri from Kanchipuram of Tamil Nadu, Sri Arjun from Bengaluru appreciated the program and requested TTD EO Sri Anil Kumar Singhal to relay the program with sub-titles in vernacular language or in English for which the EO said, their suggestion will be looked into.

While another caller Smt Rajya lakshmi from Vijayawada sought EO to introduce dress code to SVBC employees also.

When Sri Sairam from Bengaluru sought EO whether they can render service in Pourohitya, EO answered the caller that there is no such facility as TTD has qualified Purohits.

Another caller suggested EO to make hill climbing through footpath routes mandatory for all devotees except for aged to avoid vehicular pollution and waiting in queue lines in Tirumala. TTD can arrange special transportation facility for aged, he added. Answering the caller, EO said, with the time slot system the pilgrims can avoid unnecessary waiting.

A pilgrim Sri Jagan Mohan Reddy from Nandyala has suggested EO to put a check to child hawkers in Tirumala and provide them education in schools. Welcoming the suggestion, EO said the issue will be taken care of.

Another pilgrim Sri Srinivas from Tenali sought EO to provide HDPP artistes to perform at Asthana Mandapam even on week days also. And also sought EO to provide instrument artistes as it is costing around Rs.5000 to pay them while HDPP is paying them only Rs.2000 for program. The EO said, the issue will be discussed in next review meeting of HDPP.

A pilgrim Sri Karthik from Bengaluru brought to the notice of TTD EO that when he came for darshan along with his mother aged 45years suffering from arthritis problem with relevant medical certificate, the staff denied her darshan in a rude manner, as she does not fall under senior citizen category inspite of producing medical reports. EO said, the staff members are often trained on soft communication skills. But if still some persons behave in a rude manner, action will be initiated against them, he added.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆన్‌లైన్‌లో 49,060 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల :’డయల్‌ యువర్‌ ఈవో’లో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

జూన్‌ 01, తిరుమల 2018: శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన సెప్టెంబరు నెల కోటాలో మొత్తం 49,060 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 8,235 సేవా టికెట్లు విడుదల చేశామని, ఇందులో సుప్రభాతం 6,805, తోమాల 80, అర్చన 80, అష్టదళపాదపద్మారాధన 120, నిజపాద దర్శనం 1,150 టికెట్లు ఉన్నాయని ప్రకటించారు. ఆన్‌లైన్‌లో జనరల్‌ కేటగిరిలో 40,825 సేవాటికెట్లు ఉండగా, వీటిలో విశేషపూజ 1500, కల్యాణం 9,975, ఊంజల్‌సేవ 3,150, ఆర్జితబ్రహ్మోత్సవం 5,500, వసంతోత్సవం 9,900, సహస్రదీపాలంకారసేవ 10,800 టికెట్లు ఉన్నాయని వివరించారు.

తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.

1. అంకిరెడ్డి – వరంగల్‌.

ప్రశ్న: రాష్ట్రవ్యాప్తంగా టిటిడి తరపున రూపాయికి ఒక లీటర్‌ చొప్పున తాగునీటిని అందించండి? రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన ధర అధికంగా ఉంది.?

ఈ.వో. తిరుమల, తిరుపతిలో ఉచితంగా తాగునీటిని అందిస్తున్నాం. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కొనుగోలు చేసే అవసరం లేకుండా సర్వదర్శనం టోకెన్ల ద్వారా నిర్దేశించిన సమయానికి స్వామివారి దర్శనం కల్పిస్తున్నాం.

2. హరిరామప్రసాద్‌ – కాకినాడ

ప్రశ్న: వేసవిలో వృద్దులు, దివ్యాంగులు, చంటి పిల్లల దర్శనాన్ని తగ్గించారా?

ఈ.వో. అలాంటిదేమి లేదు. వృద్దులు, దివ్యాంగులు, చంటి పిల్లల దర్శనాలు కొనసాగుతున్నాయి.

3. శేషాద్రి – కాంచీపురం, అర్జున్‌ – కర్నాటక

ప్రశ్న: ఎస్వీబీసీలో సంస్కృతం నేర్చుకుందాం కార్యక్రమం బావుంది.?

ఈ.వో. ధన్యవాదాలు, మరింత మెరుపరుస్తాం.

4. రాజేష్‌- అనంతపురం

ప్రశ్న: తిరుమలలో ఉచిత బస్సులను పెంచండి, ప్రైవేట్‌ ట్యాక్సీల ధరలను స్థిరీకరించండి?

ఈ.వో. తిరుమలలో అవసరమైన ఉచిత బస్సులు నడుస్తున్నాయి. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్‌ ట్యాక్సీల ధరలను సమీక్షించి చర్యలు తీసుకుంటాం.

5. శ్రీనివాస్‌ – తెనాలి

ప్రశ్న: సహస్రదీపాలంకార సేవ మండపం వద్ద షేడ్‌ వేయించినందుకు ధన్యవాదాలు, నడకదారిలో వచ్చిన వారిని క్యూలైన్లలో నిలబెడుతున్నారు, హెచ్‌డిపిపి సంగీత కార్యక్రమాలలో ఎక్కువ మందికి అవకాశం కల్పించండి?

ఈ.వో. డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో భక్తుల సూచనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపడుతున్నాం. కాలినడక వస్తున్న భక్తులను క్యూలైన్లలో నిలబెట్టకుండా చూస్తాం. హెచ్‌డిపిపిలో ఎక్కువ మంది కళాకారులకు అవకాశం కల్పించేలా చర్యలు చేపడుతాం.

6. జగన్మోహన్‌ రెడ్డి – నంద్యాల

ప్రశ్న: తిరుమలలో వీధి వ్యాపారుల పిల్లలు రోడ్లపై తిరగకుండా పాఠశాలకు వెళ్లేలా చూడండి?

ఈ.వో. ఆలోచన బావుంది. తక్షణం చర్యలు చేపడుతాం.

7. వేెంకటేశ్వర్లు – కర్నూలు

ప్రశ్న: శుభప్రదం శిక్షణలో పాల్గొన్న పిల్లలకు శ్రీవారి దర్శనం కల్పించండి?

ఈ.వో. అలాగే కల్పిస్తాం.

8. వెంకన్న – శ్రీకాకుళం

ప్రశ్న: శ్రీవారి ఆర్జితసేవల లక్కీడిప్‌లో దంపతులిద్దరికి మాత్రమే టికెట్లు వస్తున్నాయి, పిల్లల పరిస్థితి ఏంటి?

ఈ.వో. ఎక్కువమంది భక్తులకు శ్రీవారి ఆర్జితసేవల్లో అవకాశం కల్పించడంతోపాటు, మరింత పారదర్శకత పెంచేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాం.

9. కామాక్షి – ఖమ్మం

ప్రశ్న: కాలినడకన శ్రీవారి దర్శనానికి రావాలని అనుకుంటున్నాం, టికెట్లు ఎప్పుడు ఇస్తారు?

ఈ.వో. ప్రతిరోజు అలిపిరి మార్గంలో 14 వేలు, శ్రీవారిమెట్టు మార్గంలో 6 వేల టోకెన్లను జారీ చేస్తున్నాం. ఈ టెకెట్లు దొరకని పక్షంలో తిరుమలలో సర్వదర్శనం టోకెన్లు పొంది నిర్ణీత సమయంలో స్వామివారిని దర్శించుకోవచ్చు.

10. భాస్కర్‌ -హైదరాబాద్‌

ప్రశ్న: తిరుమలలో ఆర్టీసీ బస్సులు బాలాజీ బస్టాండ్‌లో కాకుండా దూరంగా నిలుపుతున్నారు. దీంతో సీఆర్వో కార్యాలయానికి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది?

ఈ.వో. ఈ విషయంపై ఆర్టీసీ అధికారులకు సూచనలు చేస్తాం.

11. వేంకటేశ్వర్లు- హైదరాబాద్‌

ప్రశ్న: గోవిందమాల భక్తులకు నియమావళిని రూపొందించండి?

ఈ.వో. పరిశీలిస్తాం

12. సాయిరామ్‌ – బెంగుళూరు

ప్రశ్న: పౌరోహిత్యం చేస్తున్నాను, తిరుమలలో సేవ చేసే అవకాశం ఇవ్వండి?

ఈ.వో. పురోహితులకు అలాంటి అవకాశం లేదు.

14. చంద్ర – తెనాలి

ప్రశ్న: శ్రీవారిసేవకు ఎలా నమోదు చేసుకోవాలి?

ఈ.వో. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు లేదా ఉత్తరం ద్వారా మీ వివరాలను ప్రజాసంబంధాల అధికారికి పంపి నమోదు చేసుకోవచ్చు.

15. శాస్త్రి – హైదరాబాద్‌

ప్రశ్న: వైకుంఠఏకాదశి, ద్వాదశిరోజుల్లో శ్రీవారి ఆలయంలో పరకామణి సేవ చేసే అవకాశం కల్పించండి?

ఈ.వో. శ్రీవారికి ఎక్కడ సేవ చేసినా అదృష్టంగానే భావించాలి.

16. రాజ్యలక్ష్మ్షి – విజయవాడ

ప్రశ్న: ఎస్వీబీసి సిబ్బంది డ్రెస్‌ కోడ్‌ పెట్టండి?

ఈ.వో. తప్పకుండా చర్యలు తీసుకుంటాం

17. నరసింహారావు – నరసారావుపేట, అశోక్‌ – అనంతపురం.

ప్రశ్న: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అన్నం, పప్పు, సాంబారు, రసం, మజ్జిగ కలిపి భోజనం పెట్టండి?

ఈ.వో. ప్రస్తుతం అలాగే పెడుతున్నాం.

18. శ్రీరామ్‌ – హైదరాబాద్‌

ప్రశ్న: వయోవృద్ధులకు దర్శనం కష్టంగా ఉంది, అలిపిరిలో వాహనాలకు పార్కింగ్‌ ఏర్పాటు చేసి అందరూ తిరుమలకు నడచి వెళ్లేలా చర్యలు చేపట్టండి?

ఈ.వో. వయోవృద్ధులకు సౌకర్యవంతంగా దర్శనాన్ని కల్పిస్తున్నాం.

19. వేంకటేశ్వర్లు – నెల్లూరు

ప్రశ్న: తిరుమలలో ఎలక్ట్రానిక్‌ డిప్‌లో సేవా టికెట్లు పొందితే చరవాణిలకు మెసేజ్‌లు రావడం లేదు ?

ఈ.వో. పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం.

20. జయప్రద – హైదరాబాద్‌

ప్రశ్న: ప్రతినెలా విడుదల చేసే ఆర్జితసేవల్లో తిరుప్పావడ సేవ ఎందుకు ఉండటం లేదు?

ఈ.వో. తిరుమలలో ఎలక్ట్రానిక్‌ డిప్‌ ద్వారా మాత్రమే తిరుప్పావడ సేవను భక్తులకు కేటాయిస్తున్నాం.

21. నరేష్‌బాబు – బెంగుళూరు

ప్రశ్న: తిరుమల కల్యాణవేదిక వద్ద స్నానం చేసేందుకు వసతులు లేవు?

ఈ.వో. తగిన వసతులు కల్పిస్తాం.

22. నళిని – బెంగుళూరు

ప్రశ్న: తిరుమలలోని పాపవినాశనం మార్గంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో దర్శన టికెట్లకు అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ?

ఈ.వో. ఈ ఆలయం రాష్ట్రదేవాదాయ శాఖ పరిధిలో ఉంది. సంబంధిత అధికారులకు ఈ విషయాన్ని తెలియజేస్తాం.

23. అనసూయ – బెంగుళూరు

ప్రశ్న: శ్రీవారి ఆలయంలో తోపులాటలు లేకుండా చూడండి?

ఈ.వో. ఇటీవల తోపులాటలను బాగా నియంత్రించాం

24. సుధీర్‌ – శ్రీకాకుళం

ప్రశ్న: కల్యాణకట్టలో క్షురకులు డబ్బులు తీసుకోకుండా చూడండి?

ఈ.వో. సిసి టీవీల ద్వారా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ పెట్టాం.

25. కార్తీక్‌ -బెంగుళూరు

ప్రశ్న: మా తల్లిగారికి 45 సంవత్సరాలు, ఆర్థరైటిస్‌ సమస్య ఉంది, డాక్టర్‌ వద్ద నుంచి లెటర్‌ తీసుకువచ్చినా వృద్ధులు, దివ్యాంగుల కౌంటర్‌ వద్ద అనుమతించలేదు. అక్కడి సిబ్బంది లెటర్‌ను చింపేశారు?

ఈ.వో. సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. భక్తులతో గౌరవప్రదంగా నడుచుకునేలా సిబ్బందికి కౌన్సెలింగ్‌ ఇస్తాం.

26. సూర్యనారాయణ – హైదరాబాద్‌

ప్రశ్న: పీఏసీ 4లో స్నానం చేసేందుకు షవర్‌లు ఏర్పాటు చేయండి, ఏసీ కాటేజీల వద్ద తాగునీటి వసతి కల్పించండి?

ఈ.వో. పీఏసీ4లో తగిన వసతులు కల్పిస్తాం. అన్ని కాటేజీల వద్ద ఇప్పటికే ఆర్వో తాగునీటి వసతి ఉంది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.