JEO INSPECTS DEVOTEES FACILITIES AT TIRUMALA_ తిరుమలలో భక్తుల సౌకర్యాలపై జెఈవో తనిఖీలు

Tirumala, 1 June 2018: In view of huge rush of devotees Tirumala JEO Sri KS Sreenivasa Raju inspected the arrangements made for Devotees at the Anna prasadam distribution, room allotments, Anga pradakshina token counters, sarva darshan token counters etc.

The JEO interacted with devotees at the CRO on the allotment of rooms on the time taken for getting rooms, and directed the officials to speed up allotments. He directed engineering officials to put up more fans in the sheds meant for devotees waiting for rooms.

Later he also inspected the sarva darshan token counters and directed creation of easy access and widening the street to the counters and also scrutinized the licenses of some shops.

There after he inspected the Anna prasadam counters at PAC-1. At the Anga pradakshina token issue counters he directed officials to put up a display board on vacancies, also sufficient security arrangements for maintaining queue lines.

SE-2 Sri Ramachandra Reddy, VGO Sri Ravindra Reddy and Reception DyEO Sri Sridhar participated in the inspection drive.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో భక్తుల సౌకర్యాలపై జెఈవో తనిఖీలు

జూన్‌ 01, తిరుమల 2018: తిరుమలలో అధిక రద్దీ నేపథ్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ, గదుల కేటాయింపుతోపాటు అంగప్రదక్షిణ టోకెన్‌ కౌంటర్‌, సర్వదర్శనం టోకెన్‌ కౌంటర్లను టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు అధికారులతో కలిసి శుక్రవారం తనిఖీ చేశారు.

ముందుగా సిఆర్‌వోలో గదుల కేటాయింపును జెఈవో పరిశీలించి భక్తులతో మాట్లాడారు. గదులు పొందడానికి పడుతున్న సమయం, ఎంత సమయం వేచి ఉన్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన గదులు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. గదుల కోసం సిఆర్‌వో వెలుపల క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల సౌకర్యార్థం షెడ్ల వెంబడి మరికొన్ని ఫ్యాన్లు ఏర్పాటుచేయాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. ఆ తరువాత సిఆర్‌వో వెనుక గల సర్వదర్శనం కౌంటర్లను తనిఖీ చేశారు. కౌంటర్ల వద్దకు సులువుగా వెళ్లేలా వెడల్పుగా దారి ఏర్పాటు చేయాలన్నారు. అక్కడున్న పలు దుకాణాల లైసెన్సులను తనిఖీ చేశారు. అనంతరం పిఏసి-1 వద్దగల అన్నప్రసాదాల కౌంటర్‌ను పరిశీలించారు. అంగప్రదక్షిణ కౌంటర్‌లో టోకెన్ల జారీని పరిశీలించి డిస్‌ప్లే విధానాన్ని మెరుగుపరచాలని ఇడిపి అధికారులను ఆదేశించారు. ఇక్కడ భక్తులు క్రమపద్ధతిలో టోకెన్లు పొందేలా భద్రతా సిబ్బంది చర్యలు చేపట్టాలన్నారు.

జెఈవో వెంట టిటిడి ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, విజివో శ్రీ రవీంద్రారెడ్డి, రిసెప్షన్‌ డెప్యూటీ ఈవో శ్రీ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.