DIAL YOUR EO PROGRAMME EXCERPTS _ డయల్‌ యువర్‌ ఇ.ఓ

TIRUMALA, JAN 4: The monthly “Dial Your EO” programme took place at Annamaiah Bhavan in Tirumala on Friday where in the TTD EO Sri LV Subramanyam has directly attended to the phone calls made by the pilgrims from across the country and reacted to their complaints and suggestions. Some excerpts of the programme.

Answering a pilgrim caller Sri Subba Rao from Madhya Pradesh the EO thanked for the former’s gesture over complimenting the arrangements made by TTD on the auspicious occasions of Vaikuntha Ekadasi and Dwadasi. Reacting to the caller Ramkishore from Jaggayyapeta the EO said, it is not possible to increase the quota of arjitha seva tickets like thomala and archana in Advance booking system. But however, the EO suggested the pilgrim to try in the Lucky Dip system.

Answering another caller Sri Syam from Rajastan, the TTD EO said, TTD will arrange Hindi translators in the information counters for the sake of the visiting pilgrims especially hailing from Northern India. Answering a caller Satish from Surat who asked the EO to construct either a replica temple of Lord Venkateswara or a dhyan mandir as there are over 5lakh Telugus settled in Surat, the EO asked the pilgrim to come up with a proposal forming a committee with their members for future initiative.

Tirupati JEO Sri P Venkatrami Reddy, CVSO Sri GVG Ashok Kumar and other officials were also present.
———————————
2000 CCTVs TO VIGIL TIRUMALA SOON-TTD EO

As a step to beef up the security apparatus to the Tirumala temple, TTD is mulling to set up about 2000 CCTVs to vigil the entire hill shrine before the coming brahmotsavams said TTD EO Sri LV Subramanyam.

Addressing the media persons after the Dial Your EO Programme he said, these cameras will be installed at different places in Tirumala starting from Alipiri check post. Apart from this, these cameras will also be installed in vital places including Potu, Printing Press, Treasury, Annadanam etc.

Answering to a query the EO said, for the first time in TTDs history, the local temples have garnered pilgrim crowd on par with Tirumala shirne on Vaikuntha Ekadasi and New Year Day.

In a historical moment, the Chennai Information Centre Lord Balaji temple had over 1.2lakh pilgrims on January 1 while 60thousand pilgrims had darshan on Vaikuntha Ekadasi day.
He said even the other major temples of Tirupati including Srinivasa Mangapuram, Appalayagunta and Alipiri Padalamandapam, Bangalore Information Centre Balaji Temple also witnessed over 60thousand pilgrims influx.

While the sub-temples of TTD viz. Sri Kodanda Ramalayam, Kapilateertham, Govinda Raja Swamy temple had a pilgrim turn out of over 20-25thousands each on both the days.

“Another interesting thing is the ancient Konetiraya Swamy temple at Keelapatla and Annapurna Sametha Kasivishweswara swamy temple at Bugga which were taken over by TTD have registered unprecedented pilgrim rush on both the occasions with the figures touching over 20thousand mark which was a record in those temples history”, he maintained.
—————————————————–
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

డయల్‌ యువర్‌ ఇ.ఓ

తిరుమల, 04 జనవరి 2013: శుక్రవారం నాడు తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన డయల్‌ యువర్‌ ఇ.ఓ కార్యక్రమంలో భక్తుల కొన్ని ప్రశ్నలు, సూచనలు వాటికి ఇ.ఓ శ్రీఎల్‌.వి.సుబ్రహ్మణ్యం స్పందన
 
1. సుబ్బారావు – ఖాండువా. ఎం.పి మధ్యప్రదేశ్‌
వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను తి.తి.దే అధ్భుతంగా నిర్వహించింది. మన దేశంలో ఉన్న ఎన్నో ప్రముఖ దివ్యక్షేత్రాలతో పోల్చితే తిరుమల శ్రీవారి ఆలయంలో పాటిస్తున్న పరిశుభ్రత, పారదర్శకత అద్భుతం. అయితే ఉద్యోగస్థులకు మరింత పారదర్శకంగా భక్తులతో వ్యవహరించడంలో శిక్షణ ఇవ్వండి.
ఇ.ఓ. తప్పకుండా అమలు చేస్తాం.
2. రామకిశోర్‌ – జగ్గయ్యపేట.
తోమాల మరియు అర్చనవంటి సేవా టికెట్లు అడ్వాన్సు బుక్కింగ్‌ చేసినా దొరకడంలేదు.
ఇ.ఓ ఈ సేవా టికెట్లు పరిమిత సంఖ్యలో ఉన్న కారణంగా వాటి కోటాను ఇంతకంటే పెంచలేం. వీలుచూసుకొని లక్కీడిప్‌ ద్వారా ప్రయత్నించగలరు.
3. శ్యామ్‌ – రాజస్థాన్‌.
ఉత్తర భారత దేశస్థుల కొరకు హిందిలో సమాచారం అందించే సౌకర్యాన్ని తిరుమలలో ఏర్పాటు చేయగలరు.
ఇ.ఓ తప్పకుండా ప్రయత్నిస్తాం.
4. శివశంకర్‌ – కాణిపాకం.
కాణిపాకంలో తి.తి.దే సమాచార కేంద్రాన్ని ఏర్పాటుచేయడానికి మేము స్థలాన్ని విరాళంగా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము.
ఇ.ఓ పరిశీలిస్తాం.
5. సతీష్‌ – సూరత్‌.
 
సూరత్‌లో దాదాపు 5 లక్షలకు పైగా తెలుగువారు స్థిరపడివున్నారు. దయచేసి ఇక్కడ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి నమూనా ఆలయంకాని, ధ్యానమందిరాన్నిగాని నిర్మించగలరు.
ఇ.ఓ మీరు ఏవరైనా కమిటీగా ముందుకు వచ్చి మమ్ములను సంప్రదిస్తే తప్పకుండా ప్రయత్నిస్తాం.
 
ఈ కార్యక్రమంలో సి.వి.ఎస్‌.ఓ శ్రీ జి.వి.జి అశోక్‌కుమార్‌, ఆలయ డిప్యూటి ఇ.ఓ శ్రీ చిన్నంగారి రమణ, సి.ఇ శ్రీ చంథ్రేఖర్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
త్వరలో తిరుమలకు పటిష్ట భద్రత కల్పించడంలో భాగంగా 2000 సి.సి.కెమరాలుః
రానున్న బ్రహ్మోత్సవాలలోగా తిరుమలలోని వివిధ ప్రాంతాలలో నిఘా వ్యవస్థను పటిష్టం చేయడంలో భాగంగా దాదాపు 2000 సి.సి. కెమరాలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలిపిరి నుండి తిరుమల వరకు వివిధ ప్రాంతాల్లో ఈ కెమరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా తిరుమలలోని పోటు, ముద్రణాలయం, ఖజానా, అన్నదానం వంటి కీలక ప్రాంతాల్లో కూడా ఈ కెమరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
 
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది. .