DIGITAL REGULATION BEGINS IN BIRRD HOSPITAL _ ఓపి నుంచి డిశ్చార్జ్ దాకా అన్నీ ఆన్లైన్లో
-ONLINE REPORTS TO PATIENTS FROM OP-DISCHARGE IN 2 HOURS – DIGITALISATION OF HOSPITAL ADMIN AND EMPLOYEES ATTENDANCE
Tirupati, 24 November 2021: TTD has introduced new software on Wednesday in BIRRD hospital to streamline doctor-patient reports management to render quality Medicare to patients.
The new software came into being following the decision of TTD EO Dr KS Jawahar Reddy and MD of BIRRD Hospital & Additional EO Sri AV Dharma Reddy to introduce technology in providing quality services to patients, said OSD of BIRRD Dr R Reddappa Reddy.
He said in collaboration with Suvarna Software of Hyderabad, BIRRD hospital has introduced a comprehensive hospital management system to deliver quicker service to patients by securing all documents.
New system provides online appointments of doctors – Patients get easy access to doctors and also all tests reports including blood within 2 hours sent to the mobile number. – All details of the case history of patients, reports and surgical needs are being maintained online by BIRRD hospital using cloud technology. – Patients can access data with the help of an Aadhar number or OP number anytime. – The software will also post the date, necessary medication and other needs of surgery if any. – It will also record the expenses, drugs used etc.- senior officials and doctors could access all data with a click on the dashboard.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఓపి నుంచి డిశ్చార్జ్ దాకా అన్నీ ఆన్లైన్లో
– రోగుల మొబైల్ కురెండు గంటల వ్యవధిలోనే పరీక్షల రిపోర్ట్
– బర్డ్ ఆసుపత్రిలో నూతన విధానం ప్రారంభం
– ఆసుపత్రి నిర్వహణ, ఉద్యోగుల హాజరు వివరాలు కూడా ఎప్పటికప్పుడు నమోదు
తిరుపతి 24 నవంబరు 2021: ఓపి కోసం ఉదయం 5 గంటలనుంచే క్యూ లో నిల్చోవడం, ఏ డాక్టర్ ఏ సమయానికి చూస్తారా అని ఎదురు చూడటం, రక్త పరీక్షల రిపోర్టుల కోసం ల్యాబ్ చుట్టూ తిరగడం. ఇలాంటి ఇబ్బందులన్నిటికీ చెక్ పెడుతూ టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్ ఆసుపత్రి బుధవారం నుంచి నూతన సాఫ్ట్వేర్ ను ప్రారంభించింది. సువర్ణ అనే ఈ సాఫ్ట్వేర్ ద్వారా రోగుల సేవలకు శ్రీకారం చుట్టింది. బర్డ్ ఆసుపత్రిలో వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు చేయించుకోవాలనుకునే రోగులకు ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని రోగులకు మెరుగైన సేవలు అందించాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో, ఆసుపత్రి ఎండి శ్రీ ఎ వి ధర్మారెడ్డి అధికారులకు నిర్దేశం చేశారు. నూతన సాఫ్ట్వేర్ అమలు చేయడం ద్వారా రోగులకు వేగవంతమైన సేవలు, రికార్డులను భద్రపరచడం, ఆసుపత్రి నిర్వహణ వ్యవహారాలన్నీ కొనసాగిస్తామని ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డెప్పరెడ్డి తెలిపారు. ఉన్నతాధికారులు, సిబ్బంది సహకారంతో హైదరాబాద్ కు చెందిన సువర్ణ సాఫ్ట్వేర్ ను బర్డ్ లో అమలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. బుధవారం నుంచి ప్రారంభించిన కాంప్రహెన్సివ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా కలిగే ప్రయోజనాలు ఇవీ.
* దూరాభారం నుంచి వచ్చే రోగులు ఆన్లైన్ ద్వారా తమకు కావాల్సిన రోజు, కావాల్సిన సమయంలో , కావాల్సిన డాక్టర్ అపాయింట్ మెంట్ ముందుగానే రిజర్వ్ చేసుకోవచ్చు
* ఈ రకంగా అపాయింట్మెంట్ పొందిన రోగులు ఆసుపత్రి లోని ఎంఆర్డీ కౌంటర్ కు వెళ్ళగానే వారు ఏ గదికి వెళ్లాలనే వివరాలు సిద్ధంగా ఉంటాయి.
* రోగిని పరీక్షించిన డాక్టర్ రక్త పరీక్షలు రాస్తే రోగి ల్యాబ్ లో రక్తం శాంపిల్ ఇచ్చిన రెండు గంటల్లోనే రిపోర్ట్ రోగి, డాక్టర్ మొబైల్ కు వెళుతుంది. దీంతోపాటు ఒక కాపీ ప్రింట్ తీసి మెడికల్ రికార్డ్ విభాగంలో భద్రపరుస్తారు.
* దీంతోపాటు రోగికి రాసిన మందులు, రక్త పరీక్షల రిపోర్టులు, రోగి జబ్బుకు సంబంధించిన వివరాలు, సర్జరీ చేస్తే అందుకు సంబంధించిన సమస్త సమాచారం ఆన్లైన్లో భద్రపరచడం జరుగుతుంది. ఇందుకోసం బర్డ్ ఆసుపత్రి క్లౌడ్ టెక్నాలజీని వినియోగిస్తోంది.
* రోగులు తమ ఓపి నంబర్ లేదా ఆధార్ నంబర్ తో ప్రపంచంలో ఎక్కడి నుంచైనా తమ రిపోర్టులు చూసుకునే అవకాశం లభిస్తుంది.
* రోగులకు సర్జరీ అవసరం అయితే సాఫ్ట్వేర్ ద్వారానే సర్జరీ తేదీ అందుతుంది.
* ఉద్యోగులు ఏ సమయానికి వచ్చారు ఏ సమయానికి వెళ్లారనే వివరాలు కూడా ఈ సాఫ్ట్వేర్ లో పొందుపరచుతారు.
* దీంతో పాటు ఆసుపత్రికి ఏ రోజు ఏ మందులు కొన్నారు. ఏ రోజు ఏ రోగికి ఏ మందులు వాడారు. ఎన్ని సర్జరీలు జరిగాయి. ఎంత ఖర్చయ్యింది. ఫార్మసీలో ఎన్ని మందులు నిల్వ ఉన్నాయి అనే వివరాలు సైతం ఈ సాఫ్ట్వేర్ లో పొందుపరుస్తారు.
* ఉన్నతాధికారులు డ్యాష్ బోర్డ్ ద్వారా ఒక క్లిక్ తో ఈ వివరాలన్నీ తెలుసుకోవచ్చు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది