ELABORATE ARRANGEMENTS FOR RATHASAPATHAMI AT LOCAL TEMPLES- TTD JEO _టిటిడి స్థానికాలయాల్లో రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు : జెఈవో శ్రీ వీరబ్రహ్మం
Tirupati, 09 January 2022: TTD JEO Sri Veerabrahmam has directed officials to make extensive arrangements at all the TTD local temples and subsidiaries for the upcoming Rathasapthami festival.
Addressing a virtual conference with temple officials and other department heads on Monday morning the JEO instructed officials concerned to organise colourful vahana sevas and Mula murti darshans at Sri Kodandaramaswami, Sri Kalyana Venkateswara Swamy at Srinivasa mangapuram, at Narayanavanam, Nagalapuram and Devuni Kadapa.
He asked the DFO to check the strength of vahanas and Rathas in advance besides completing pending works in coordination with all departments.
JEO also reviewed Maha Samprokshana arrangements at Jammu, Chennai, Rampachodavaram and Seethampeta temples which are nearing completion and scrutinised issues like Panchaloha idols, ornaments, deputation of Archakas and staff, sanitisation etc.
He advised concerned staff to organise electrical and flowers decorations, Anna Prasadam, drinking water queue lines, parking etc. arrangements on par with Vaikunta Ekadasi fete.
SEs Sri Satyanarayana, Sri Venkateswarlu, DyEOs Sri Gunabhushan Reddy, Sri Govindarajan, Transport GM Sri Sesha Reddy, VGO Sri Manohar, DFO Sri Srinivas and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడి స్థానికాలయాల్లో రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు : జెఈవో శ్రీ వీరబ్రహ్మం
తిరుపతి, 2023 జనవరి 09: టిటిడి స్థానికాలయాలు, అనుబంధ ఆలయాల్లో ఈనెల 28న రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని జెఈవో శ్రీ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఆలయాల అధికారులు, ఇతర విభాగాల అధికారులతో సోమవారం ఉదయం జెఈవో వర్చువల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ కోదండరామాలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరాలయం, నారాయణవనం, నాగలాపురం, దేవుని కడప తదితర అలయాల్లో రథసప్తమి సందర్భంగా వాహనసేవలతో పాటు చక్కగా మూలమూర్తి దర్శనం కల్పించాలని ఆదేశించారు. అన్ని ఆలయాల్లో వాహనాల పటిష్టతను ముందస్తుగా పరీక్షించాలని డిఎఫ్‌వోకు సూచించారు. దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రథోత్సవానికి గాను రథం పటిష్టతను పరిశీలించాలన్నారు. ఆయా ఆలయాల్లో వివిధ విభాగాల అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటుచేసి పెండింగ్ పనులు వేగవంతం చేయాలన్నారు.
అదేవిధంగా, జమ్మూ, చెన్నై, రంపచోడవరం, సీతంపేట ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయిన ఆలయాల్లో మహాసంప్రోక్షణకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఆయా ఆలయాలకు అవసరమైన ఆభరణాలు, శిలా విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు, అర్చక సిబ్బంది, ఇతర డెప్యుటేషన్ సిబ్బంది, పారిశుద్ధ్య ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. ఈ ఆలయాలకు సంబంధించి పనుల పురోగతిపై ఇంజినీరింగ్ అధికారులు నివేదిక సమర్పించాలన్నారు. మహాసంప్రోక్షణ కార్యక్రమాలకు విచ్చేసే భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు అందించాలని, ఆకట్టుకునేలా విద్యుద్దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టాలని ఆదేశించారు. అంతకుముందు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాల వారీగా చేపట్టిన ఏర్పాట్లు, భవిష్యత్తులో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారుల నుండి సూచనలు, సలహాలు స్వీకరించారు.
వర్చువల్ సమావేశంలో ఎస్‌ఇలు శ్రీ సత్యనారాయణ, శ్రీ వెంకటేశ్వర్లు, డెప్యూటీ ఈవోలు శ్రీ గుణభూషణ్‌రెడ్డి, శ్రీ గోవిందరాజన్, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, విజివో శ్రీ మనోహర్, డిఎఫ్‌వో శ్రీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.