ENDOWMENT MINISTER OF AP OFFERED PRAYERS TO LORD VENKATESWARA _ శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి
శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి
తిరుపతి, మే 28, 2013: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ సి.రామచంద్రయ్య సోమవారం సాయంత్రం సహస్త్రదీపాలంకార బ్రేక్‌లో తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సోమవారం నాడు మంత్రివర్యుల జన్మదినం కావడంతో ఆయన తిరుమలకు విచ్చేశారు. ముందుగా స్వామివారి సహస్త్రదీపాలంకార ఊంజల్‌సేవలో పాల్గొన్నారు. అనంతరం ఎస్‌డి బ్రేక్‌లో శ్రీవారిని సుపథం మార్గం ద్వారా దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వైదికులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను తిరుపతి జెఈఓ శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, సివిఎస్‌ఓ శ్రీ జివిజి.అశోక్‌కుమార్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ చిన్నంగారి రమణ, పేష్కార్లు శ్రీ కోదండరామారావు, శ్రీ కేశవరాజు, పారుపత్తేదార్ శ్రీ అజయ్ తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.