GOKULASTAMI FETE ON SEP 3 _ తిరుమలలో సెప్టెంబరు 3న శ్రీకృష్ణ జన్మాష్టమి, 4న ఉట్లోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

Tirumala, 2 September 2018: Tirumala has decked up to observe Gokulastami fete on September 3 and 4.

Gokulastami Asthanam will be performed in Bangaru Vakili of Tirumala temple on September 3 between 8pm and 10pm.

On the same day, special Abhishekam will be performed to Kaliya Mardhana Krishna located in Gogarbham Gardens between 11am and 12noon by Garden wing of TTD.

Later on September 4, Utlotsavam will be observed from 4pm to 8pm. TTD has cancelled all evening arjitha sevas in connection with this fete on Tuesday.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో సెప్టెంబరు 3న శ్రీకృష్ణ జన్మాష్టమి, 4న ఉట్లోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

తిరుమల, 02 సెప్టెంబరు 2018; కలియుగ వైకుంఠమైన తిరుమలలో సెప్టెంబరు 3న సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి, సెప్టెంబరు 4న మంగళవారం ఉట్లోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టిటిడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

శ్రీ వేంకటేశ్వరస్వామియే సాక్షాత్తు ద్వాపర యుగపురుషుడైన శ్రీకృష్ణునిగా సంస్మరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత సెప్టెంబరు 3వ తేది రాత్రి 8.00 గంటల నుండి 10.00 గంటల నడుమ శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, శ్రీ కృష్ణస్వామివారికి ఏకాంతంగా తిరుమంజనం, ద్వాదశ ఆరాధన నిర్వహించనున్నారు. అనంతరం ప్రభంద శాత్‌మొర, గోకులాష్టమి ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు. అదేవిధంగా గోగర్భం డ్యామ్‌ చెంత వెలసియున్న ఉద్యానవనంలో కాళీయమర్ధనుడు అయిన శ్రీకృష్ణుడుకి ఉదయం 11.00 గంటలకు పంచాభిషేకాలను ఘనంగా నిర్వహించనున్నారు. అభిషేకానంతరం ఇదే ప్రాంగణంలో మధ్యాహ్నం 12.00 గంటలకు ఉట్లోత్సవాన్ని కూడా నిర్వహించనున్నారు. అటుతరువాత ప్రసాద వితరణ కార్యక్రమం జరుగనుంది.

కాగా సెప్టెంబరు 4న తిరుమలలో ఉట్లోత్సవాన్ని సాయంత్రం 4.00 గంటల నుండి రాత్రి 8.00 గంటల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉట్లోత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ తిలకిస్తారు. యువకులు ఎంతో ఉత్సాహముతో ఉట్లను కొడుతూ స్వామివార్లకు ఆనందాన్ని చేకూర్చుతారు.

ఈ ఉట్లోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబరు 4వ తేదిన ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. ఈ వేడుకల్లో టిటిడి ఉన్నతాధికారులు పాల్గొంటారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.