EO BRIEFS ON IMPORTANT DECISIONS OF TTD BOARD MEETING_ టిటిడి విద్యాసంస్థ‌ల‌కు రూ.100 కోట్ల‌తో అద‌న‌పు హాస్ట‌ల్ భ‌వ‌నాలు : టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్‌

Tirupati, 23 Sep. 19: The maiden TTD Trust Board meeting was held at Annamaiah Bhavan in Tirumala under the Chairmanship of TTD Board Chief Sri YV Subba Reddy on Monday.
During a press conference held at Tirupati, TTD EO Sri Anil Kumar Singhal briefed some major decisions upon the request of media. The resolutions as follows:

TTD board has given green signal for Rs. 100 crore worth works to construct additional hostel buildings for TTD educational institutions like Sri Padmavati Mahila Degree College, SV Arts college, SGS Arts college, SV Oriental College for the sake of the student

The board has given nod towards the construction of a Sports complex for TTD employees near the TTD printing press area in Tirupati at Rs.10crore

The board sanctioned Rs. 9.60 crore for setting up a new Liquid Waste Management unit near Pachikalva Gangamma temple on the Tirumala outer ring road for the benefit of pilgrims.

In order to protect the environment in Tirumala, the Board approved the introduction of 40 battery operated electric cars in the place of Diesel/Petrol vehicles along with 40 drivers to be appointed for running these vehicles through a Manpower agency to be selected through tenders.

The board has instructed TTD EO and Special Officer of Tirumala to decide upon the guidelines and detailed modalities on the possibility of providing VIP darshan to the donors of SRIVANI Trust of TTD which will be decided before next board meeting.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి విద్యాసంస్థ‌ల‌కు రూ.100 కోట్ల‌తో అద‌న‌పు హాస్ట‌ల్ భ‌వ‌నాలు : టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్‌

తిరుపతి, 2019 సెప్టెంబరు 23: టిటిడి విద్యాసంస్థలైన తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల, ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల, ఎస్‌జిఎస్‌ ఆర్ట్స్‌ కళాశాల, ఎస్వీ ప్రాచ్య ఉన్నత పాఠశాలల్లో రూ.100 కోట్లతో అదనపు హాస్టల్‌ భవనాల నిర్మాణం చేప‌ట్టేందుకు ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి నిర్ణ‌యించింద‌ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో సోమ‌వారం సాయంత్రం తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌తో క‌లిసి ఈవో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ ఉద్యోగుల సౌకర్యార్థం టిటిడి ముద్రణాలయం సమీపంలో రూ.10 కోట్ల‌తో క్రీడల భవనాన్ని నిర్మిస్తామ‌న్నారు. తిరుమలలో రూ.9.60 కోట్లతో నీటిశుద్ధి కర్మాగారం నిర్మిస్తామ‌ని తెలిపారు. సంభావ‌న ప్రాతిప‌దిక‌న విధులు నిర్వ‌హిస్తున్న శ్రీ ఎస్‌.ప‌ద్మ‌నాభం స‌ర్వీసుల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ అంశాన్ని ప్ర‌భుత్వానికి నివేదించిన‌ట్టు తెలిపారు. ఎస్‌సి, ఎస్‌టి ప్రాంతాల్లో శ్రీ‌వారి ఆల‌యాల నిర్మాణానికి గాను శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా విరాళాలు స్వీక‌రిస్తున్నామ‌ని, విరాళాలిచ్చే దాత‌ల‌కు ఒక‌సారి విఐపి బ్రేక్ ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌ని, ఇత‌ర మార్గ‌ద‌ర్శ‌కాల‌ను వారంలోపు ఖ‌రారు చేస్తామ‌ని వెల్ల‌డించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.