EO HOLDS REVIEW MEETING ON LANDSLIDES WITH EXPERTS _ కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతంలో మరమ్మతులపై ఈఓ సమీక్ష

Tirumala, 4 Dec. 21: TTD EO Dr KS Jawahar Reddy held a review meeting on Landslides – aversion measures with the experts on Saturday evening at SPRH in Tirupati.

A team of three professors, Prof. Manisha, Prof. Nirmala Vasudevan, Prof. Sudesh Vadhawan from Mata Amrita Viswa Vidyapeetham, Kerala belonging to the Strategic Initiatives Research and Innovation department presented a PowerPoint presentation on Landslides in Himalayan ranges, Western ghats, etc.

TTD CE Sri Nageswara Rao later presented the photos of landslides that occurred in Tirumala ghat roads during recent rains.

 

EO asked the experts team to visit the landslide areas on December 5 and suggest recommendations to TTD to address the issue.

JEOS Sri Veerabrahmam, Smt Sada Bhargavi, CVSO Sri Gopinath Jatti, FACAO Sri Balaji, DFO Sri Srinivasulu Reddy were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

 

కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతంలో మరమ్మతులపై ఈఓ సమీక్ష

తిరుమల, 2021 డిసెంబర్ 04: తిరుమల ఘాట్ రోడ్ లో కొండ చరియలు విరిగిపడిన ప్రాంతంలో చేపట్టాల్సిన పునరుద్ధరణ పనులపై టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి శనివారం సాయంత్రం తిరుపతిలోని శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో నిపుణులతో సమీక్ష నిర్వహించారు.

కేరళలోని మాతా అమృత విశ్వవిద్యాలయం స్ట్రాటజిక్ ఇన్షియేటివ్స్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ విభాగానికి చెందిన నిపుణులు ప్రొఫెసర్ మనీషా, ప్రొఫెసర్ నిర్మల వాసుదేవన్, ప్రొఫెసర్ సుదేష్ విద్వాన్ కలిసి హిమాలయ పర్వతాలు, పశ్చిమ కనుమల్లో కొండచరియలు విరిగిపడడం, పునరుద్ధరణ చర్యలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.

ఈ సందర్భంగా సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి వర్షాల వల్ల దెబ్బతిన్న ఘాట్ రోడ్ల పరిస్థితిని నిపుణులకు వివరించారు. అనంతరం టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు ఇటీవల కురిసిన వర్షాలకు కొండచరియలు విరిగిపడిన ఘటనకు సంబంధించిన ఫొటోలను చూపారు. కొండచరియలు విరిగి పడిన ప్రాంతాన్ని డిసెంబర్ 5న పరిశీలించి పునరుద్ధరణ చర్యలకు సంబంధించి తగిన సూచనలు అందించాలని ఈ సందర్భంగా నిపుణులను ఈఓ కోరారు.

ఈ సమీక్షలో జెఈఓలు శ్రీ వీరబ్రహ్మం, శ్రీమతి సదా భార్గవి, ఎఫ్ఎ అండ్ సిఏఓ శ్రీ బాలాజి, డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.