SRI KRT FESTIVALS_ జూలైలో శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Tirupati, 03 July 2018: The important festival occasions in Sri Kodanda Rama Swamy temple in the month of July are as follows:

July 7, 14 , 21, 28- Abhishekam to Mula Virat on payment of Rs.20 per ticket per person.

July 13- Sita Rama Kalyanam on the advent of Punarvasu star by 11am with Rs.500 per ticket on which two persons will be allowed.

July 13- Sahasra Kalasabhishekam on the day of dark phase of moon, Rs.500 per ticket on which two persons will be allowed followed by Evening procession of Hanumantha Vahanam.

July 17 – Anivara Asthanam.

July 27 – Lunar Eclipse.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

జూలైలో శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2018 జూలై 03: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జూలైలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

– జూలై 7, 14, 21, 28వ తేదీల్లో శనివారాల్లో ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామలక్ష్మణుల మూలవర్లకు అభిషేకం చేస్తారు. రూ.20/- టికెట్‌ కొనుగోలుచేసి భక్తులు పాల్గొనవచ్చు. సాయంత్రం 6 గంటలకు ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. సాయంత్రం 7గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

– జూలై 13న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం జరుగనుంది. రూ.500/- టికెట్‌ కొనుగోలు చేసి గృహస్తులు పాల్గొనవచ్చు. ఇదేరోజున అమావాస్య సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామలక్ష్మణ ఉత్సవమూర్తులకు, కౌతుకబేరమూర్తులకు, విష్వక్సేనులవారికి సహస్రకలశాభిషేకం నిర్వహిస్తారు. రూ.500/- చెల్లించి భక్తులు పాల్గొనవచ్చు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ నిర్వహిస్తారు.

– జూలై 17న ఆణివార ఆస్థానం.

– జూలై 27న చంద్రగ్రహణం.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.