EO INSPECTS NANDAKAM GUEST HOUSE _ నందకం అతిథిగృహాన్ని పరిశీలించిన ఈఓ
నందకం అతిథిగృహాన్ని పరిశీలించిన ఈఓ
తిరుమల, 2012 ఆగస్టు 7: తిరుమలలో త్వరలో పూర్తి కానున్న నందకం అతిథిగృహాన్ని మంగళవారం తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం పరిశీలించారు. రెండు వేల మంది యాత్రికులకు బస వసతి కల్పించేందుకు రూ.30 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ అతిథిగృహం త్వరలో ప్రారంభానికి సిద్ధం కానుంది. ఈ సందర్భంగా ఈవో సంబంధిత అధికారులతో మాట్లాడుతూ భక్తులకు ఉపయోగకరమైన రీతిలో ఈ నందకం అతిథిగృహాన్ని మరిన్ని వసతులతో తీర్చిదిద్దాలని సూచించారు. అందులో భాగంగా మెడిటేషన్ హాలు, సిసిటీవీలు, ఎలక్ట్రానిక్ లాకర్లు, ప్లాస్మా టీవీలు, సమాచార కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా భక్తులకు అర్థమయ్యే రీతిలో వివిధ భాషల్లో సూచికబోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జెఈఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, చీఫ్ ఇంజినీర్ శ్రీ చంథ్రేఖర్‌రెడ్డి, అడిషినల్ సివిఎస్‌ఓ శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎస్‌ఈ-2 శ్రీ రమేష్‌రెడ్డి, ఇఇ శ్రీ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.