EO INVITES SEER FOR MAHA SAMPROKSHANAM OF ODISHA TEMPLE _ భువనేశ్వర్ శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు విశాఖ శార‌ద పీఠాధిప‌తిని ఆహ్వానించిన

TIRUMALA, 15 MAY 2022: TTD EO Sri AV Dharma Reddy on Sunday invited the Pontiff of Visakha Sarada Peetham, Sri Swarupanandendra Saraswathi Swamy for the Mahasamprokshanam event of Sri Venkateswara temple in the state of Orissa from May 21 to 26.

 

He formally met the Swamiji at the latter’s Mutt near Gogarbham dam at Tirumala and explained to him about the series of rituals on each day.

 

DyEO General Sri Ramana Prasad was also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భువనేశ్వర్ శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు విశాఖ శార‌ద పీఠాధిప‌తిని ఆహ్వానించిన –  టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమ‌ల‌, 2022 మే 15: భువనేశ్వర్‌లో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆల‌య మహాసంప్రోక్షణ కార్యక్రమానికి హాజరు కావాలని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి  విశాఖ శార‌ద పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామి, పీఠం ఉత్త‌రాధికారి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వాత్మానందేంద్ర స‌ర‌స్వ‌తి స్వామివారిని ఆహ్వానించారు. తిరుమ‌ల గోగ‌ర్భం స‌మీపంలోని శార‌దా పీఠానికి ఆదివారం ఈవో చేరుకుని స్వామీజీ ఆశీస్సులు అందుకున్నారు.

మే  21 వ తేదీ నుంచి ఆలయ మహాసంప్రోక్షణకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి స్వామిజీకి తెలియజేశారు. 26వ తేదీ విగ్రహ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ, ఆవాహన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతాయని ఆయ‌న వివరించారు.

ఈ కార్య‌క్ర‌మంలో జ‌న‌ర‌ల్ డెప్యూటీ ఈవో డా.ర‌మ‌ణ ప్ర‌సాద్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.