EO RELEASES FOUR BOOKS ON FRIDAY @ MADA STREETS_ శ్రీవారి వాహనసేవలో పుస్తకాల ఆవిష్కరణ

Tirumala, 29 September 2017: TTD Executive Officer Sri Anil Kumar Singhal dedicated four more publications from the TTD publication division on Friday in front of Surya Prabha vahanam at Four mada streets.

They were Surya Satakam by Dr Talluri Anjaneyulu, Nayanarlu- Shiva Bhaktulu by Dr Alla Appa Rao, Sri Venkateswara Darshan- (English) by G Saibabu, and Karavirapura Mahatma by MMV Subramanyam.

Speaking on the occasion Sri Singhal said it was the mandate of the TTD to popularize and propagate the sanatana Hinduism through publication of devotional books,audio and Video cassettes.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTD,TIRUPATI

శ్రీవారి వాహనసేవలో పుస్తకాల ఆవిష్కరణ

తిరుమల, 29 సెప్టెంబరు – 2017: తిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీమలయప్పస్వామి పంచాయుధమూర్తిగా సూర్యప్రభ వాహనసేవలో భక్తులకు దర్శనం ఇచ్చారు.

ఈ సందర్భంగా టిటిడి ప్రచురణల విభాగం ఆధ్వర్యంలో రూపొందిచిన 4 పుస్తకాలను అవిష్కరించారు. టిటిడి ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి డా|| తాళ్లురి ఆంజనేయులు సంస్కృతం నుండి తెలుగులో అనువాదించిన ”సూర్యశతకమ్‌”, ప్రముఖ రచయత డా|| ఆళ్ల అప్పారావు రచించిన ”నాయనార్లు – శివభక్తులు” గ్రంథం, శ్రీ జి.సాయిబాబ ఆంగ్లంలో అనువాదించిన ”శ్రీవేంకటేశ్వరస్వామి దర్శన్‌”, ముక్తినూతలపాటి ఎం.వి.సుబ్రహ్మణ్యం రచించిన ఆష్టాదశ శక్తిపీఠాల్లో ఒక్కటైన కొల్హాపుర క్షేత్రంలో వెలసిన శ్రీ మహలక్షి అమ్మవారి మహాత్మ్య తెలిపే ”కరవీరపుర మాహాత్యం” అనే పుస్తకాలను టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, సివిఎస్‌వో శ్రీ ఆకె.రవికృష్ణ ఆవిష్కరించారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.