EO VISITS SVBC CONTROL ROOM_ భక్తులను ఆకట్టుకుంటున్న ఎస్వీబీసీ ప్రసారాలు :టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
Tirumala, 29 September 2017: TTD Executive Officer, Sri Anil Kumar Singhal today inspected the SVBC control room located in the mada street and reviewed the live telecasting operations of Vahana seva and other programs.
Accompanied by the CEO of SVBC Sri A V Narasimha Rao, he went around the control room and the commentators box and made some suggestions for improvement of visuals and commentaries.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTDs,TIRUPATI
భక్తులను ఆకట్టుకుంటున్న ఎస్వీబీసీ ప్రసారాలు :టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
సెప్టెంబర్ 29, తిరుమల 2017: శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాల్లో శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసారాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. బ్రహ్మూెత్సవాలకు ప్రత్యేకంగా ప్రత్యక్ష ప్రసారాలు అందించేందుకు ఏర్పాటుచేసిన ఎస్వీబీసీ కంట్రోల్ రూమ్‌ను శుక్రవారం ఉదయం ఈవో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ వాహనసేవలతోపాటు శ్రీవారి ఆలయంలో నిర్వహించే స్నపనతిరుమంజనం, ఇతర కైంకర్యాలు, నాదనీరాజనం వేదికపై నిర్వహిస్తున్న కార్యక్రమాలను మెరుగ్గా ప్రసారం చేస్తున్నారని అభినందించారు. భవిష్యత్తులో మరింత మెరుగ్గా ప్రసారాలను అందించేందుకు అవసరమైన సాంకేతిక పరికరాలను సమకూర్చుకోవాలని సూచించారు.
అనంతరం కంట్రోల్ రూమ్‌లోని ప్రత్యక్ష ప్రసారాల ఏర్పాట్లను, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వ్యాఖ్యానం అందించడాన్ని ఈవో పరిశీలించారు.
టిటిడి ఈవో వెంట ఎస్వీబీసి సిఇవో శ్రీ ఎ.వి.నరసింహారావు ఇతర సిబ్బంది ఉన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.