EO REVIEWS ON DEPARTMENT-WISE BRAHMOTSAVAM ARRANGEMENTS _ శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల‌ ఏర్పాట్లపై విభాగాల వారీగా ఈవో సమీక్ష

INSPECTS NEW PARAKAMANI BUILDING WORKS

 

TIRUMALA, 24 SEPTEMBER 2022: With only a couple of days left for the annual Srivari Brahmotsavams, TTD EO Sri AV Dharma Reddy reviewed the department-wise arrangements for the big festival.

 

The review meeting was held at Annamaiah Bhavan in Tirumala on Saturday. JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam and CVSO Sri Narasimha Kishore were also present.

 

Speaking on the occasion, the EO said that every employee has to feel the onus since the mega festival is taking place amidst pilgrim public after two years. “As more pilgrims are being anticipated, every employee should discharge his or her responsibility with more dedication especially on the most challenging day of Garuda Seva on October 1”, he maintained.

 

CEO SVBC Sri Shanmukh Kumar, CE Sri Nageswara Rao, SE 2 Sri Jagadeeshwar Reddy and Deputy EOs, heads of other departments, and other senior officials of TTD were also present.

 

EO INSPECTS

 

Later, the EO also inspected the newly constructed Parakamani Building adjacent to Annaprasadam Complex which is set ready to be inaugurated by the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy on September 28.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల‌ ఏర్పాట్లపై విభాగాల వారీగా ఈవో సమీక్ష

– నూత‌న పరకామణి భ‌వ‌నం త‌నిఖీ

తిరుమల, 2022 సెప్టెంబ‌రు 24: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలకు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండ‌డంతో విభాగాల వారీగా చేప‌ట్టిన ఏర్పాట్ల‌పై టిటిడి ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి సమీక్షించారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం ఈ సమీక్ష జ‌రిగింది. జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్‌వో శ్రీ నరసింహ కిషోర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రెండేళ్ల తర్వాత మాడ వీధుల్లో భ‌క్తుల స‌మ‌క్షంలో వాహ‌న‌సేవ‌లు జ‌రుగ‌నున్నాయ‌ని, ప్రతి ఉద్యోగీ బాధ్యతగా తమ విధులు నిర్వ‌హించాల‌ని కోరారు. విశేషంగా భ‌క్తులు విచ్చేసే అవ‌కాశం ఉండ‌డంతో ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని, అక్టోబర్ 1న గరుడ సేవ నాడు మ‌రింత అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ్‌కుమార్, సిఇ శ్రీ నాగేశ్వరరావు, ఎస్‌ఇ -2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, ఇత‌ర టిటిడి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పరకామణి భ‌వ‌నం త‌నిఖీ

సెప్టెంబరు 28న ముఖ్యమంత్రివ‌ర్యులు శ్రీ వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్న అన్నప్రసాదం కాంప్లెక్స్‌కు ఆనుకుని నూతనంగా నిర్మించిన పరకామణి భవనాన్ని ఈవో పరిశీలించారు. ముఖ్య‌మంత్రి ప‌ర్య‌టన సంద‌ర్భంగా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయ‌బ‌డిన‌ది.