TTD TO FOCUS MORE ON NON COVENTIONAL ENERGY RESOURCES _ తిరుమలలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 18 June 2018: As TTD has ushered on the utilisation of the non-conventional energy resources, EO Sri Anil Kumar Singhal instructed the officials concerned to explore more areas to make use of these resources in the best possible way.

During the review meeting with all senior officers in the conference hall in TTD Administrative building in Tirupati on Monday, the EO instructed the engineering officials to find out the possibilities of setting up solar resources plants in Upamaka, Keelapatla, Tumburu akin to Kosuvaripalle.

He instructed the engineering officials to complete the pending works in Kapilateertham Kalyanakatta, Radhamandapam in Keelapatla, Temple wall in Valmikipuram and other outside temples within time frame.
The EO instructed the officials concerned to invite experts to take up electrical wiring and firefighting measures in a better way in Tirumala for the sake of devotees. He also said, the senior officers committee should efficiently man the different darshan queue lines. He also directed the concerned to find out the mechanism to avoid the fall of thunders and lightening during the ensuing rainy season.

He directed the concerned to give training to call centre staffs in soft communication skills and update their knowledge on dynamic information related to TTD from time to time. He also instructed the officials to distribute pamphlets to the Sarva darshan token pilgrims about various visiting places surrounding Tirupati so that they visit those places also.

He instructed the DFO Sri Phani Kumar Naidu to complete the plantation programme in Tiruvenkatapatham outer ring road.

JEOs Sri KS Sreenivasa Raju, Sri P Bhaskar, CE Sri Chandrasekhar Reddy, FACAO Sri Balaji, CVSO Incharge Sri Siva Kumar Reddy and others were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

జూన్‌ 18, తిరుపతి, 2018: తిరుమలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వివిధ ప్రాంతాల్లో విద్యుత్‌ వైరింగ్‌, అగ్నిప్రమాద నివారణ పరికరాలు వాడకానికి సంబంధించి ఏవైనా లోపాలుంటే సరిదిద్దేందుకు దేశంలోని గుర్తింపు పొందిన సంస్థల ద్వారా పరిశీలన చేపట్టి, వారి నివేదిక ఆధారంగా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం సీనియర్‌ అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో తిరుమలలో పిడుగులు పడడాన్ని అరికట్టేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. తిరుమలలో రూ.300/- ప్రత్యేక ప్రవేశదర్శనం, దివ్యదర్శనం, సమయ నిర్దేశిత సర్వదర్శనం, సర్వదర్శనం భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూలైన్లను క్రమబద్ధీకరించేందుకు సీనియర్‌ అధికారులతో కూడిన కమిటీ సమయానుకూలంగా పని చేయాలన్నారు. సేవాటికెట్లు, గదుల బుకింగ్‌లో తలెత్తే సమస్యలు, ఇతర విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని భక్తులకు తెలియజేసే కాల్‌ సెంటర్‌ సిబ్బందికి ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వాలని సూచించారు. తిరువేంకటపథంలో జరుగుతున్న మొక్కలపెంపకాన్ని పూర్తి చేయాలని డిఎఫ్‌వో శ్రీ ఫణికుమార్‌ నాయుడును ఆదేశించారు. తిరుపతి, తిరుమలలో సర్వదర్శనం టోకెన్లు పొందుతున్న భక్తులకు టిటిడి స్థానిక ఆలయాలు, సందర్శనీయ ప్రాంతాల సమాచారంతో కూడిన కరపత్రాలను ముద్రించి భక్తులకు పంపిణీ చేయాలన్నారు.

కోసువారిపల్లె తరహాలో తుమ్మూరు, కీలపట్ల, ఉపమాక ప్రాంతాల్లో సౌరవిద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఈవో ఆదేశించారు. తిరుపతిలోని శ్రీకపిలేశ్వరాలయంలో కల్యాణకట్ట, కల్యాణోత్సవ మండపం, కీలపట్లలోని శ్రీకోనేటిరాయ స్వామివారి ఆలయంలో రథమండపం పనులు, వాల్మీకిపురంలోని శ్రీపట్టాభిరామస్వామివారి ఆలయంలో ప్రహరీ నిర్మాణ పనులు, చంద్రగిరిలోని శ్రీకోదండరామాలయం, కోసువారిపల్లెలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం, తరిగొండలోని శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయం, కందులవారిపల్లెలోని టిటిడి ఆలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

ఈ సమావేశంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీపోల భాస్కర్‌, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీమతి గౌతమి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.