EX-GRATIA PAID TO THE MOTHER OF DECEASED VOLUNTEER _ శ్రీవారి సేవకుని కుటుంబానికి టిటిడి ఛైర్మన్ చేతులమీదుగా రూ.7 లక్షలు ఆర్థికసాయం
Tirumala, 23 Nov. 19: An amount of Rs.7lakhs including one lakh cash has been paid to Ms.Odemma, the mother of deceased Srivari Sevak Sri Mothe Suman who accidentally died while in service at Tirumala by TTD Chairman Sri YV Subba Reddy.
The Trust Board Chief speaking to media persons in his camp office at Swarna Tirumala Rest House said that it is very unfortunate that the 28-year-old Mother Suman died due to a fatal fall from the second floor of Seva Sadan 2 in Tirumala while he was in Srivari Seva between July 1 to July 4.
“After struggling for life on ventilator at SVIMS super speciality hospital for almost a week, he breathed his last on July 9. We came to know that his economic background is very poor and he is the breadwinner for his family consisting of his ailing mother. The board has decided to do a bit and as a humane gesture we sanctioned an ex-gratia of Rs.5lakhs including Insurance cover while a couple of board members including Smt Prasanthi Reddy and Smt Sudha Narayana Murthy have donated Rs.one lakh each to the mother of deceased volunteer as a token gesture”, he added.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి సేవకుని కుటుంబానికి టిటిడి ఛైర్మన్ చేతులమీదుగా రూ.7 లక్షలు ఆర్థికసాయం
తిరుమల, 2019 నవంబరు 23: తిరుమలలోని సేవా సదన్‌లో పై అంతస్తు నుండి ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడి మృతి చెందిన శ్రీవారి సేవకుడు తెలంగాణకు చెందిన శ్రీ మోతే సుమన్ కుటుంబానికి శనివారం టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి రూ.7 లక్షలు ఆర్థికసాయం అందించారు. శ్రీ మోతే సుమన్ తల్లి శ్రీమతి మోతే ఓదెమ్మకు ఈ మొత్తాన్ని అందజేశారు. తిరుమలలోని స్వర్ణ తిరుమల విశ్రాంతి గృహంలోని ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామానికి చెందిన శ్రీ మోతే సుమన్(28) జూన్ 30 నుండి జూలై 4వ తేదీ వరకు 4 రోజుల పాటు శ్రీవారి సేవ చేసేందుకు వచ్చారని తెలిపారు. సేవా విధుల్లో భాగంగా జూలై 2న తిరుపతిలో పరకామణి సేవ ముగించుకుని తిరుమలలోని శ్రీవారి సేవా సదన్-2లో విశ్రమిస్తుండగా ప్రమాదవశాత్తు 2వ అంతస్తు నుండి కిందపడ్డారని చెప్పారు. తలకు, ఇతర శరీరభాగాలకు తీవ్ర గాయాలయ్యాయని, వెంటనే అశ్వని ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యుల సూచన మేరకు తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో అత్యవసర వైద్య విభాగంలో చేర్చారని వివరించారు. తాను కూడా వెళ్లి శ్రీ మోతే సుమన్‌ను పరామర్శించానని, డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధతో మెరుగైన వైద్యం అందించారని తెలిపారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేసినా ఫలితం లేకపోయిందని, జూలై 9న శ్రీ మోతే సుమన్ తుదిశ్వాస విడిచారని వెల్లడించారు.
శ్రీ మోతే సుమన్‌కు తల్లి మాత్రమే ఉందని, వారి కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని గత బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని ఛైర్మన్ తెలిపారు. ఇందులో ఇన్సూరెన్స్ సొమ్ము రూ.3 లక్షలు కాగా, టిటిడి ఆర్థిక సాయం రూ.2 లక్షలని వివరించారు. అదేవిధంగా, టిటిడి బోర్డు సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఒక లక్ష రూపాయలు, మరో బోర్డు సభ్యురాలు శ్రీమతి సుధా నారాయణమూర్తి ఒక లక్ష రూపాయలు ఆర్థికసాయం ప్రకటించారని తెలియజేశారు. పేదరికంలో ఉన్నా శ్రీవారిపై భక్తితో శ్రీవారి సేవకు వచ్చిన శ్రీ మోతే సుమన్ ఆత్మకు శాంతి కలగాలని ఈ సందర్భంగా ఛైర్మన్ కోరారు.
కాగా, ప్రస్తుతం టిటిడి ప్రకటించిన రూ.5 లక్షలు చెక్కును, శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అందించిన ఒక లక్ష రూపాయలు నగదును శ్రీమతి మోతే ఓదెమ్మకు అందించారు. శ్రీమతి సుధా నారాయణమూర్తి ప్రకటించిన ఒక లక్ష రూపాయలు శ్రీమతి మోతే ఓదెమ్మ బ్యాంకు ఖాతాలో జమ కానుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.