EXHIBITION STEALS THE SHOW IN ANNUAL FETE _ కల్యాణవేదిక వద్ద ప్రదర్శనశాలల‌ను ప్రారంభించిన టీటీడీ ఛైర్మన్‌, ఈవో

CHAIRMAN LAUDS THE DEPARTMENTS

TIRUMALA, 18 SEPTEMBER 2023: TTD Chairman Sri Bhumana Karunakara Reddy along with EO Sri AV Dharma Reddy inaugurated TTD exhibition stalls in Kalyana Vedika on Monday.

On this occasion, a photo exhibition was held under the auspices of the Public Relations Department, a display and sale of TTD Panchagavya products, a fruit and flower exhibition under the Garden Department, a herbal expo by SV Ayurveda Hospital,  sculpture exhibition by SVITSA  and a book fair under the auspices of SV Vedic University.

The Gajendra Moksha episode in Sand Art by Ms. Gowri from Karnataka, Bhimasena carrying food on a cart for Bakasura, Dasharatha cradling Sri Rama, Lakshmana, Bharata, Shatrughnu with his wives Kausalya, Sumitra, Kaikeyi, Krishna killing the demon In Putana, Lord Vishnu killing Bhasmasura in the form of Mohini, Lord Krishna testing Ghatotkaju in the form of an old man, Lord Krishna fighting with Jambavantu for Samantakamani, Ananthalvar wounding Lord Venkateswara Swamy with a club, Lord Anantapadmanabha with Nelamaligalu, Ravanasura fighting Jatayu, Hanuman killing demon Mahiravana, Aswametha etc. settings exuding devotion.

Both the Chairman and EO lauded the efforts of all departments in sprucing up the exhibition.

PRO Dr T Ravi, Garden Deputy Director Sri Srinivasulu, Deputy CF Sri Srinivasulu, SVITSA Principal Sri Venkat Reddy, Ayurvedic Hospital Medical Superintendent Dr Renu Dixit and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు -2023

కల్యాణవేదిక వద్ద ప్రదర్శనశాలల‌ను ప్రారంభించిన టీటీడీ ఛైర్మన్‌, ఈవో

– భ‌క్తుల‌ను ఆక‌ట్టుకుంటున్న ఫ‌ల‌పుష్ప‌, అట‌వీ, శిల్ప‌, ఆయుర్వేద‌, ఫొటో ప్ర‌ద‌ర్శ‌న‌శాల‌లు

తిరుమల, 2023 సెప్టెంబ‌రు 18: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలను పుర‌స్క‌రించుకుని తిరుమలలోని కల్యాణవేదిక వద్ద ఏర్పాటుచేసిన ఫ‌ల‌పుష్ప‌, అట‌వీ, శిల్ప‌, ఆయుర్వేద‌, ఫొటో ప్ర‌ద‌ర్శ‌న‌శాల‌లను టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి క‌లిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్‌, టీటీడీ పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల ప్రదర్శన, విక్రయం, ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఫలపుష్ప ప్రదర్శన, ఎస్వీ ఆయుర్వేద ఆసుప‌త్రి ఆధ్వర్యంలో వనమూలికా ప్రదర్శన, శ్రీవేంకటేశ్వర శిల్పకళాశాల ఆధ్వర్యంలో శిల్పకళా ప్రదర్శనలను, ఎస్వీ వేద వ‌ర్సిటీ ఆధ్వ‌ర్యంలో పుస్త‌క ప్ర‌ద‌ర్శ‌న‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయా విభాగాల అధికారులను ఛైర్మ‌న్‌, ఈవో అభినందించారు.

ఫలపుష్ప ప్రదర్శనలో భాగంగా గ‌జేంద్ర మోక్షం సైక‌త శిల్పం, బ‌కాసురుడి కోసం బండిపై ఆహారం తీసుకెళుతున్న భీమ‌సేనుడు, శ్రీ‌రామ‌, ల‌క్ష్మ‌ణ‌, భ‌ర‌త‌, శ‌తృఘ్నుల‌ను ఊయ‌ల‌లో ప‌వ‌ళింప‌చేస్తున్న ద‌శ‌ర‌థుడు, కౌస‌ల్య‌, సుమిత్ర‌, కైకేయి, పూత‌న అనే రాక్ష‌సిని సంహ‌రిస్తున్న చిన్నికృష్ణుడు, వ‌రాన్ని ప్ర‌సాదించిన శివుడిపైనే ప్ర‌యోగం చేస్తున్న భ‌స్మాసురుడిని మోహినీ రూపంలో అంతం చేస్తున్న శ్రీ‌మ‌హావిష్ణువు, వృద్ధుడి రూపంలో ఘ‌టోత్క‌జుడిని ప‌రీక్షిస్తున్న శ్రీ‌కృష్ణుడు, శ‌మంత‌క‌మ‌ణి కోసం జాంబ‌వంతునితో యుద్ధం చేస్తున్న శ్రీ‌కృష్ణుడు, బాలుని రూపంలో తోట‌లో విహ‌రిస్తున్న శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామిని గ‌డ్డ‌పార‌తో గాయ‌ప‌రుస్తున్న అనంతాళ్వార్‌, శ్రీ అనంత‌ప‌ద్మ‌నాభుని నిల‌యం, నేల‌మాళిగ‌లు, రావ‌ణాసురుడు సీత‌ను ఎత్తుకెళ్లేట‌పుడు అడ్డ‌గిస్తున్న జఠాయువు, మ‌హిరావ‌ణుడు అనే రాక్ష‌సుడిని సంహ‌రించి శ్రీ‌రామ‌ల‌క్ష్మ‌ణుల‌ను కాపాడి తీసుకొస్తున్న హ‌నుమంతుడు, శ్రీ‌రామునితో యుద్ధం చేస్తున్న ల‌వ‌కుశులు త‌దిత‌ర పౌరాణికాంశాల సెట్టింగులు భ‌క్తిభావాన్ని పంచుతున్నాయి.

అదేవిధంగా, ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో అలిపిరి న‌డ‌క‌మార్గంలో చారిత్ర‌క ప్ర‌దేశాలు, ఏడో మైలు శ్రీ ప్ర‌స‌న్న ఆంజ‌నేయ‌స్వామి, శ్రీ‌వారి మెట్టు మార్గం, తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం, మాడ వీధుల్లోని ఆల‌యాలు, తిరుమ‌ల‌లో సంద‌ర్శ‌నీయ ప్రాంతాలు త‌దిత‌ర అంశాల‌ను కళ్లకు కట్టే ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి.

ఈ కార్యక్రమంలో ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు, డెప్యూటీ సిఎఫ్ శ్రీ శ్రీ‌నివాసులు, ప్రజాసంబంధాల అధికారి డా|| టి.రవి, ఎస్వీ ఆయుర్వేద ఆసుప‌త్రి మెడిక‌ల్ సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ రేణుదీక్షిత్‌ ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.