EXTENDED RESEARCH NEEDED IN AYURVEDIC MEDICINE- VICE-CHANCELLOR OF NTR HEALTH UNIVERSITY _ ఆయుర్వేద వైద్యం లో విస్తృత పరిశోధనలు జరగాలి

Tirupati, 20 July 2021: Extended Research for the benefit of humanity is need to be taken up in an effective manner in Ayurvedic Medicine, said Dr P Shyam Prasad, Vice-chancellor of NTR Health University on Tuesday.

Addressing a get together session at the auditorium of Sri Venkateswara Ayurveda College he said the scope for research and development in Ayurvedic Medicine is immense and all students should be encouraged by teachers in Research along with promotion of communication skills to interact with patients. “The NTR University will extend its full co-operation to take up Research”, he maintained.

Calling for utmost care and all out precautions on the anticipated dangers of the third wave of COVID-19, he urged Ayurvedic doctor also to research on vaccine and medicines to thwart its dangers. As an alumni of SV Medical College he recalled how he worked with blessings of Sri Venkateswara.

Dr Muralikrishna, Principal of SV Ayurvedic College said that since it’s inception in 1982, the college had produced many giants working all over the world and that 210 bed hospital was also managed at Tirupati.

Earlier Dr Shyam Prasad went round the Ayurvedic hospital and the college, interacted with the students and faculty members and also enquired about production of Ayurvedic medicines, distribution and also Panchakarma system of medicine.

Vice-principal Dr Sundaram, RMO Dr G Padmavati, PG Reader Dr Renu Dikshit and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆయుర్వేద వైద్యం లో విస్తృత పరిశోధనలు జరగాలి
– డాక్టర్లు రోగులతో ప్రేమగా మాట్లాడితే సగం జబ్బు నయమవుతుంది
 ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ శ్యామ ప్రసాద్

తిరుపతి 20 జూలై 2021: ఆయుర్వేద వైద్యంలో విస్తృత పరిశోధనలు చేయాలని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఉప కులపతి డాక్టర్ పి.శ్యామ ప్రసాద్  పిలుపునిచ్చారు. ఇలాంటి పరిశోధన లకు విశ్వవిద్యాలయం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు.
       
శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల సమావేశ మందిరంలో  మంగళవారం ఆయన వైద్యులతో ఆత్మీయ సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డాక్టర్ కావడం పూర్వ జన్మ సుకృతం అని చెప్పారు. ఎంతో నమ్మకం తో వచ్చే రోగితో ప్రేమగా మాట్లాడి, వారి జబ్బుగురించి పూర్తిగా తెలుసుకుని ధైర్యం చెప్పడం వల్ల రోగికి సగంజబ్బు నయమవుతుందన్నారు. మారుతున్న పరిజ్ఞానానికి అనుగుణంగా డాక్టర్లు నైపుణ్యం పెంచుకోవాలన్నారు.పుస్తకాలు చదవడం కంటే రోగిని డీల్ చేయడమే ముఖ్యమన్నారు. ఆయుర్వేద వైద్యం లో పరిశోధనలకు మంచి అవకాశాలున్నాయని, ప్రొఫెసర్లు విద్యార్థులను ఈ దిశగా ప్రోత్సహించాలన్నారు. ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు మరింత దగ్గర చేయడానికి యూనివర్సిటీ ప్రయత్నం చేస్తుందని డాక్టర్ శ్యామ ప్రసాద్ చెప్పారు. వైద్య రంగంలో మరింత పురోగతి సాధించడానికి ప్రధాని శ్రీ నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఎంబీబీఎస్ సీటు రానందువల్ల ఆయుర్వేద వైద్యంలో చేరామనే భావన ఉంటే తొలగించుకుని ప్రతి ఒక్కరు పరిశోధనల వైపు దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. వైద్యులు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా నేర్చుకుని, రోగులతో బాగా మాట్లాడి వారిలో నమ్మకం పెం చాలన్నారు.

3వ వేవ్ పట్ల జాగ్రత్తగా ఉండండి
       
ప్రపంచాన్ని తలకిందులు చేసిన కోవిడ్ 19 మూడవ వేవ్ రాబోతోందని నిపుణులు చెబుతున్నారన్నారు. దీనిపై జాగ్రత్తగా ఉంటూ, ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.  కోవిడ్ 19 అనేక రకాలుగా రూపాంతరం చెందుతోందని ఆయుర్వేద వైద్యంలో కూడా దీనికట్టడికి  పరిశోధనలు చేయాలన్నారు. కోవిడ్ 19 మానవాళికి అనేక పాఠాలు నేర్పిందని అన్నారు. డాక్టర్లు కేవలం సంపాదన కోసమే కాకుండా పేదలకు మేలు చేసేలా కూడా ఆలోచించాలన్నారు. తనకు తిరుపతితో ఎంతో అనుబంధం ఉందని, తాను ఎస్వీ మెడికల్ కాలేజి విద్యార్థినని ఆయన గత స్మృతులు నెమరు వేశారు.
       
ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ, 1982లో ప్రారంభమైన ఈ కళాశాలలో చదివిన అనేకమంది దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. 210 పడకలతో ఆయుర్వేద ఆసుపత్రి కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుందరం తో పాటు వైద్యులు, వైద్య విద్యార్థులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఆసుపత్రి, కళాశాల పరిశీలన
       
అంతకు ముందు డాక్టర్ శ్యామ ప్రసాద్ ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి, కళాశాలను పరిశీలించారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలకు వెళ్ళి అక్కడి డాక్టర్ల తో మాట్లాడారు. మందుల తయారీ, వాటి పంపిణీ, పంచకర్మ విధానాల గురించి తెలుసుకున్నారు. కళాశాలలో ప్రతి విభాగానికి వెళ్ళి వాటి విధుల గురించి ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ ను అడిగి తెలుసుకున్నారు. ఆర్ ఎమ్ ఓ డాక్టర్ జి.పద్మావతి, పిజి రీడర్ డాక్టర్ రేణు దీక్షిత్ పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది