FINANCIAL DISCIPLINE IS A MOST IMPORTANT COMPONENT-TTD EO _ ఆర్థిక క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి – టీటీడీ ఈవో

TIRUPATI, 26 MAY 2023: For the development of any organisation the financial discipline is one of the most important components to achieve goals without compromising on the quality, and in the last three years SVBC achieved this credit said TTD EO Sri AV Dharma Reddy. 

 

The EO attended an interactive programme with the employees of SVBC in the Meeting Hall in SVBC Office on Friday along with the CEO of SVBC Sri Shanmukh Kumar. Addressing the occasion, the EO said with the effective coordination by the present CEO, SVBC has overcome the gaps in the administration and financial aspects. 

 

Quoting a few slokas with meaning from Bhagavat Gita, the EO asked every employee should own the institution and work hard for its reputation. “We all know how the programmes like Sundarakanda, Bhagavat Gita, Yoga Darshanam etc.have transformed the face of SVBC. For the past three years, SVBC is standing in the numero uno position among all the spiritual channels across the country and the programmes have been critically acclaimed even across the world. We achieved this feat by cutting almost 50% of unnecessary expenditure, at the same time without compromising on the quality of programmes. This spirit of team work should continue forever”, he added.

 

Later EO advised the CEO to hold monthly review meetings on what sort of spiritual programmes need to be designed, how to enhance the quality of programmes in a much better way and other administrative issues if any by interacting with the employees inviting ideas from them also.

 

Administrative, News, Production, Technical, Financial and other staff of SVBC were present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఆర్థిక క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి – టీటీడీ ఈవో

తిరుపతి, 2023 మే 26: ఏ సంస్థ అభివృద్ధి చెందాలన్నా, నాణ్యతలో రాజీపడకుండా లక్ష్యాలను సాధించడానికి ఆర్థిక క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని, గత మూడేళ్లలో ఎస్వీబీసీ ఈ ఘనత సాధించిందని టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి అన్నారు.

శుక్రవారం ఎస్వీబీసీ కార్యాలయంలోని మీటింగ్ హాల్‌లో ఎస్వీబీసీ ఉద్యోగులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమానికి ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్‌తో కలిసి ఈవో హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ప్రస్తుత సిఈవో సమర్ధవంతంగా సమన్వయం చేసుకొని ఎస్వీబీసీ పరిపాలన, ఆర్థిక అంశాల్లోని లోపాలను అధిగమించారన్నారు.

భగవత్గీత లోని కొన్ని శ్లోకాలను అర్థంతో బాటు ఉదహరిస్తూ, ప్రతి ఉద్యోగి సంస్థను స్వంతంగా భావించి, దాని ప్రతిష్ట కోసం కృషి చేయాలని ఈవో కోరారు. “సుందరకాండ, భగవద్గీత, యోగ దర్శనం మొదలైన కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎస్వీబీసీకి ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ, పేరు, ప్రఖ్యాతులు లభించాయని చెప్పారు. గత మూడు సంవత్సరాల నుండి ఎస్వీబీసీ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆధ్యాత్మిక ఛానెల్‌లలో అగ్రస్థానంలో ఉందని, ప్రసారమయ్యే కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకొంటున్నాయని తెలిపారు. మనం దాదాపు 50% అనవసరమైన ఖర్చులను తగ్గించడం ద్వారా ఈ ఘనతను సాధించామని, అదే సమయంలో కార్యక్రమాల నాణ్యతలో ఎక్కడా రాజీపడలేదని, ఇదే స్ఫూర్తి తో అందురు సమిష్టి కృషితో ముందుకెళ్లాలని” పిలుపునిచ్చారు.

అనంతరం ఆయన సీఈఓ ను ప్రతి నెలా సమావేశం నిర్వహించి భక్తుల కోసం ఏ విధమైన ఆధ్యాత్మికl కార్యక్రమాలను రూపొందించాలి, కార్యక్రమాల నాణ్యతను మరింతగా ఎలా పెంచాలి మరియు ఇతర పరిపాలనాపరమైన అంశాల కు సంబంధించి సిబ్బంది అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కూడా తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ పరిపాలన, న్యూస్, ప్రొడక్షన్, సాంకేతిక, ఆర్థిక, ఇతర విభాగాలకు చెందిన సిబ్బంది హాజరయ్యారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది