“FIND OUT MECHANISM TO PRESERVE EVERY DROP OF RAIN WATER”-TTD EO_ కపిలతీర్థం, మాల్వాడి గుండం నీటి సంరక్షణకు ప్రణాళికలు : ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌

Tirupati, 4 September 2017: TTD EO Sri Anil Kumar Singhal called up on the officials of Forest and Engineering wings to find out the mechanisms to preserve every drop of rain water.

The review meeting with senior officers of TTD was held in the chambers of TTD EO in TTD Administrative Building in Tirupati on Monday. The EO reviewed on various developmental activities pertaining to various departments in TTD along with Tirupati JEO Sri P Bhaskar.

He said, due to the recent rains, the two big torrents, Kapilateertham and Malavadigundem are flowing in full swing from Tirumala Hills. “Come out with a sustainable mechanism to preserve these waters for future purpose”, he reiterated. Later the EO instructed the engineering wing to take in to consideration the recommendations made by police department to avoid accidents in Ghat Roads. A decision in this regard for laying speed breakers and crash barriers may be taken after the joint inspection by a team of officers comprising Tirumala JEO, CVSO and SE II”, the EO said.

The EO also instructed the engineering wing to complete the pending civil works in Tiruchanoor, Kodandaramalayam, Kapilateertham and Vontimitta temples within stipulated time. “Archaka Quarters should be constructed in TTD-information centres located at Bhuvaneshwar, Kanyakumari, Kurukshetra and Hyderabad for the sake of Archakas. Proper manpower assessment for FMS related works both at Tirumala and Tirupati should be made by Engineering officials and a report is submitted”, the EO directed the concerned authorities.
The EO directed the IT wing to complete the Srivari Seva on line application at an early date for three-day, four-day and special occasion services apart from the existing seven-day service.

On Parakamani counting, the EO directed the concerned to complete and dispose the accounting of higher denomination foreign currency notes first. “Concerned HoDs have to solve the issues related to the employees lodged in Grievances Cell from time to time”, he added.

CE Sri Chandrasekhar Reddy, Additional FACAO Sri Balaji, Additional CVSO Sri Sivakumar Reddy and other officers were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
కపిలతీర్థం, మాల్వాడి గుండం నీటి సంరక్షణకు ప్రణాళికలు : ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌

సెప్టెంబర్‌04,తిరుపతి, 2017: నీటి పొదుపు చర్యల్లో భాగంగా వర్షాకాలంలో కపిలతీర్థం, మాల్వాడి గుండానికి చేరుతున్న నీటిని సంరక్షించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని టిటిడి ఇంజినీరింగ్‌, అటవీశాఖల అధికారులను ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలోగల ఈవో కార్యాలయంలో సోమవారం సీనియర్‌ అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఘాట్‌ రోడ్లలో ప్రమాదాల నివారణకు తిరుమల జెఈవో, సివిఎస్‌వో, ఎస్‌ఈ-2 తనిఖీలు చేపట్టాలని, పోలీసుల సలహాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన ప్రాంతాల్లో క్రాష్‌ బ్యారియర్స్‌, స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ కోదండరామాలయం, శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయం, ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయాల్లో ఇంజినీరింగ్‌ పనులను నిర్ణీత సమయంలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అలిపిరి చెక్‌ పాయింట్‌ వద్ద స్కానర్ల మరమ్మతులను చేపట్టాలన్నారు. శ్రీవారిసేవ నూతన మార్పులతో కూడిన ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని ఐటీ అధికారులను ఆదేశించారు.

తిరుమల, తిరుపతిలో ఎఫ్‌ఎంఎస్‌ పనులను పరిశీలించి తగినంతమంది సిబ్బంది ఉండేలా చూడాలన్నారు. పరకామణి విభాగంలో విదేశీ కరెన్సీ విషయంలో అధిక విలువ ఉన్న కరెన్సీని, నాణేలను తొలుత లెక్కింపు చేపట్టాలన్నారు. ఉద్యోగుల సమస్యలను ఆయా విభాగాధిపతులు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. కురుక్షేత్ర, కన్యాకుమారి, హైదరాబాద్‌, భువనేశ్వర్‌లోగల శ్రీవారి ఆలయాలు, సమాచార కేంద్రాల వద్ద అర్చకుల క్వార్టర్స్‌ నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు.

ఈ సమావేశంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, ఎఫ్‌ఎసిఏవో శ్రీ ఒ.బాలాజీ, చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీ చంద్రశేఖర్‌ రెడ్డి, అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.