సెప్టెంబరు 6న తిరుమలలో బ్రహ్మోత్సవ ప్రయోగాత్మక గరుడ సేవ
సెప్టెంబరు 6న తిరుమలలో బ్రహ్మోత్సవ ప్రయోగాత్మక గరుడ సేవ
తిరుమల, 04 Sep 2017: బుధవారం నాడు పౌర్ణమి తిథిని పురస్కరించుకుని ఆ రోజు సాయంత్రం తిరుమలలో గరుడ సేవను టిటిడి నిర్వహించనుంది.
ఈ నెల 23 నుండి అక్టోబరు 1 వరకు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనుండగా, గరుడ సేవ సెప్టెంబరు 27న జరుగనున్నది.
బ్రహ్మొత్సవ గరుడసేవకు సమాయత్తమవడములో భాగంగా సెప్టెంబర్ 6 న పౌర్ణమి గరుడ సేవను టిటిడి మాదిరి గరుడసేవగా ప్రయోగాత్మకముగా నిర్వహించనుంది.
ఆ రోజు సాయంత్రం 7గం నుండి రా 9గం వరకు శ్రీ మలయప్ప స్వామి వారు గరుడ వాహనం పై నాల్గు మాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు.
ఇందుకుగాను టిటిడి లోని వివిధ విభాగాలు కూడా సిద్ధమౌతున్నాయి. ఈ సేవలో టిటిడి అధికారగణం, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొననున్నారు.
టిటిడి ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది