ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో సాలకట్ల తెప్పోత్సవాలు

ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో సాలకట్ల తెప్పోత్సవాలు

ఫిబ్రవరి 05, తిరుమల, 2018: తిరుమలలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1వ తేదీ వరకు ఐదు రోజులపాటు సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్నాయి.

తెప్పోత్సవాలను ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తారు. తొలిరోజు సాయంత్రం శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణీ సమేతంగా శ్రీక ష్ణస్వామివారు పురవీధులలో ప్రదక్షిణంగా ఊరేగుతూ వచ్చి పుష్కరిణిలో తెప్పపై మూడుసార్లు విహరిస్తారు. ఇక చివరి మూడురోజులు శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు తిరుచ్చినెక్కి సర్వాలంకార భూషితుడై పురవీధుల్లో ఊరేగిన అనంతరం కోనేటిలోని తెప్పపై ఆశీనుడై మూడోరోజు మూడుసార్లు, నాలుగో రోజు ఐదుసార్లు, ఐదో రోజు ఏడుసార్లు విహరించి భక్తులను కటాక్షిస్తారు.

ఆర్జితసేవలు రద్దు :

తెప్పోత్సవాల కారణంగా ఫిబ్రవరి 25, 26వ తేదీల్లో వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవ, ఫిబ్రవరి 27, 28, మార్చి 1వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మూెత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.