“FLOWERS DONATION to Sri Varu. _ దాతలు పుష్పాలను విరాళాల రూపంలో పంపాలి
Tirupati, 20 October 2009: In view of the Annual Pushpa Yagam Mahotsavams to be conducted on October 26 at Sri Vari Temple, Tirumala. Flowers on donation will be accepted told Sri Srinivas, Garden Supdt, TTDs.
Flowers like Lily, Roses, scent-jaji, Maruvam, lotus, jasmine, chamanthi, kanakambaram, sampangi, ganneru, thulasi, bilvam, Hybiscus, Kaluva, mogili, masa-pathri, Dhavanam, Nandivardanam, Mandaram etc. The donors are requested to send the Flowers to the Garden Superindentent Officer, TTDs, Tirumala on the 25th of October evening.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
దాతలు పుష్పాలను విరాళాల రూపంలో పంపాలి
తిరుపతి, అక్టోబర్-20, 2009: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 26వ తేదిన జరుగనున్న వార్షిక పుష్పయాగ మహోత్సవానికి కావలసిన వివిధ రకాల పుష్పాలను దాతలు విరాళాల రూపంలో పంపాలని తితిదే ఉద్యానవన శాఖాధికారి ఒక ప్రకటనలో కోరారు.
కార్తీకమాసం శ్రావణనక్షత్రం రోజున శ్రీవారికి అత్యంత వైభవంగా జరుగు పుష్పయాగ మహోత్సవంలో మల్లె, జాజి, గులాబి, కనకాంబరం, చామంతి, మందార, వృక్షి, తామర, కలువ, మొగలి, సంపంగి, మాను సంపంగి, లిల్లీస్, విరిజాజులు, జునియా, మరువం, దవణం, తులసి, కదిరిపచ్చ, బిల్వం, పన్నీరు ఆకు, మనోరంజిని, నందివర్థనం, గన్నేరు, సెంటుజాజులు తదితర 25 రకాముల సుంగంధపరిమళ పుష్పాలను ఉపయోగిస్తారు. ఈ మహోత్సవానికి పుష్పాలను విరాళంగా ఇవ్వదలచిన భక్తులు ఉద్యానవన శాఖాధికారి, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుమలకు చేరునట్లు పుష్పాలను పంపాల్సిందిగా కోరడమైనది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.