FOLLOW THE GANDHIAN WAY – TIRUPATI JEO_ గాంధీ బాటలో నడవాలి: టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్

Tirupati ,2 October 2017: The truth and non-violence are the two powerful most weapons adopted by Mahatma Gandhi to achieve Independence to our country which has made him Father of Nation”, observed Tirupati JEO Sri P Bhaskar.

The 149th Birth Anniversary of Mahatma Gandhi was observed in TTD administrative building quadrangle in Tirupati on Monday.

Speaking on this occasion, the JEO said, Gandhian ideologies have not only impacted Indians but across the world. He said the path laid by Mahatma Gandhi are immortal. Following his ideologies to lead a pious life is the real tribute we pay to him”, he maintained.

SE I Sri Ramesh Reddy, DyEOs Smt Snehalatha, Smt Goutami, Additional Health Officer Dr Sunil were also present.



ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTD,TIRUPATI

గాంధీ బాటలో నడవాలి: టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్

తిరుపతి, 02 అక్టోబరు 2017: సత్యం, అహింస అనే ఆయుధాల ద్వారా గాంధీజి దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టారని, ఆయన బాటలోనే అందరూ నడవాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ కోరారు. తిరుపతి లోని టిటిడి పరిపాలన భవనంలో సోమవారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈవో మాట్లాడుతూ గాంధీజి దృష్టిలో స్వాతంత్య్రం అంటే పరిపూర్ణమైన వ్యక్తి వికాసానికి అవకాశమని, అంటరానితనం, మురికివాడలు లేని పరిస్థితులు రావడమని తెలియజేశారు. రామో విగ్రహవాన్‌ ధర్మ: అని పురాణాలు శ్రీరాముని వర్ణించాయని, అటువంటి సత్య, ధర్మ, అహింసా మార్గాలను అనుసరించి నేటి ప్రపంచానికి చూపిన మహనీయుడు గాంధీజి అని, అందుకే ఆయన జాతిపితగా కీర్తించబడ్డాడని వివరించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఎస్ఇ-1శ్రీ రమేష్ రెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ మతి గౌతమి, శ్రీ మతి స్నేహలత, అదనపు ఆరోగ్యశాఖాధికారి డా.. సునీల్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.