FULL-FLEDGED CHILDREN’S SUPER SPECIALITY HOSPITAL IN 18 MONTHS-TTD-EO _ చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏడాదిన్నరలోపు పూర్తి చేయాలి : టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి

Tirupati, 05 March 2022: TTD EO Dr KS Jawahar Reddy has instructed the TTD Engineering Officials to ensure completion of construction works of the Children’s super speciality hospital within one and a half years time from now.

Addressing a review meeting with Engineering Officials at Sri Padmavati Rest House in Tirupati on Saturday the EO directed JEO Sri Veerabrahmam to set up a committee of experts to speed up hospital construction and also for the purchase of the latest medical equipments in consultation with the management of other private hospitals and seek their expert advice.

Among others he also directed officials to install new fans in Tirumala cottages and remove old ones, new lifts at Asta Vinayaka Rest House, organise modular switchboards at Kausthubham Rest House and a 750 KVA DG set to provide non-stop power at Tirumala.

He also instructed to set up electrification at  Bata Gangammagudi temple and marketing godown in Tirumala and organise lightening secure equipment around Srivari temple, underground cables near Sri Padmavati rest house region, cables tray to secure all cables installed in Vaikuntam queue complex 1&2, a new pipeline near Go Garbham dam, stand by motors and pumps near drain water cleaning plant, and also to complete construction works of Karnataka Choultry by December.

He also discussed about the land acquired by the National Highways near SV Diary farm in Tirupati.

JEO Sri Veerabrahmam, FA&CAO Sri O Balaji, CE Sri Nageswara Rao, Law Officer Sri Reddappa Reddy, DFO Sri Srinivasulu Reddy, Estate Officer Sri Mallikarjuna were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏడాదిన్నరలోపు పూర్తి చేయాలి : టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి

 తిరుపతి, 2022 మార్చి 05: చిన్నారులకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని ఏడాదిన్నర లోపు పూర్తి చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో ఇంజనీరింగ్ అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంతోపాటు అధునాతన వైద్య పరికరాలు సమకూర్చుకునేందుకు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయాలని జెఈఓ శ్రీ వీరబ్రహ్మంను ఆదేశించారు. ఆసుపత్రి నిర్వహణకు సంబంధించి ఇతర ప్రముఖ ఆసుపత్రుల యాజమాన్యంతో చర్చించి వారి నైపుణ్యాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

తిరుమలలోని పలు కాటేజీల్లో చాలాకాలం క్రితం ఏర్పాటు చేసిన ఫ్యాన్లను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. పాంచజన్యం, అష్టవినాయక విశ్రాంతి గృహాల్లో లిఫ్టులను తొలగించి నూతనంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కౌస్తుభం విశ్రాంతి గృహంలో పాత స్విచ్ బోర్డులను తొలగించి మాడ్యులర్ స్విచ్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. తిరుమలలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు గాను 750 KVA DG SET ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

తిరుమలలోని మార్కెటింగ్ గోడౌన్, గంగమ్మ గుడి ప్రాంతాల్లో వెలుతురు ఉండేలా విద్యుద్దీపాలు మరిన్ని ఏర్పాటు చేయాలన్నారు. శ్రీవారి ఆలయ పరిసరాల్లో పిడుగుల నివారణకు అవసరమైన పరికరాలు అమర్చాలని సూచించారు. తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం ప్రాంతంలో భూగర్భ కేబుళ్లను మార్చాలన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లో కేబుళ్లు విడివిడిగా లేకుండా కేబుల్ ట్రే ఏర్పాటు చేయాలన్నారు. గోగర్భం డ్యామ్ వద్ద చాలా ఏళ్ళ క్రితం ఏర్పాటుచేసిన పైపుల స్థానంలో కొత్త పైపులు ఏర్పాటు చేయాలన్నారు. మురుగునీటి శుద్ధి ప్లాంట్ నద్ద స్టాండ్ బై పద్ధతిలో మోటార్లు, పంపులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కర్ణాటక సత్రాల వద్ద డిసెంబర్ నాటికి రెండు బ్లాకులను పూర్తిస్థాయిలో నిర్మించాలన్నారు.

అనంతరం తిరుపతిలోని ఎస్వీ డైరీ ఫారం వద్ద నేషనల్ హైవేస్ స్వాధీనం చేసుకున్న స్థలానికి సంబంధించిన అంశంపై అధికారులతో చర్చించారు.

ఈ సమావేశంలో జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, ఎఫ్ఏసిఏఓ శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, లా ఆఫీసర్ శ్రీ రెడ్డెప్ప రెడ్డి, డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాసులురెడ్డి, ఎస్టేట్ అధికారి శ్రీ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.