GRAND GANGA PUJA IN SRI KT_ కపిలతీర్థంలో ఘనంగా గంగపూజ

Tirupati, 14 December 2018: Ganga puja was performed on Friday evening at the Pushkarani of Sri Kapileswara Swamy Temple amidst chanting of Veda mantras.

The priests offered harati to Gangamma and special rituals to Gangamma for bestowing good rains which filled up reservoirs in Tirupati and Tirumala and resolve drinking water needs of people.

Earlier to mark the event a procession of Kalashas was held from Govindaraja High School to the Sri Kapileswara Swamy Temple by the TTD water works department and an Ayudha Pooja was also performed at the Vishnu premises.

Suptd Engineer Sri Ramulu, TTD Executive Engineer Sri Manoharam and other officials of the TTD water works department participated in the event.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

కపిలతీర్థంలో ఘనంగా గంగపూజ

తిరుపతి, 2018 డిసెంబరు 14: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయం వద్దగల పుష్కరిణిలో శుక్ర‌వారం సాయంత్రం గంగపూజ ఘనంగా జరిగింది. టిటిడి అర్చకులు వేదమంత్రాలు పఠిస్తూ గంగమ్మకు పుసుపు కుంకుమ, హారతి సమర్పించారు.

తిరుమలలోని శ్రీవారి ఆలయంతో పాటు స్థానిక ఆలయాల్లో యాగాలు, పలు హోమాలను టిటిడి తరచుగా నిర్వహిస్తున్న‌ది. వీటి ఫలితం వర్షాలు కురిసి తిరుమ‌ల‌, తిరుప‌తి జ‌లాశ‌యాల‌కు, ప్రజలకు నీటి అవ‌స‌రాలు తీరుతున్నాయి.

అంతకుముందు టిటిడి వాటర్‌ వర్క్స్‌ విభాగం ఆధ్వర్యంలో టిటిడి పరిపాలనా భవనం ఎదురుగా గల శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాల నుంచి కలశం ఊరేగింపుగా శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయానికి చేరుకుంది.

అనంత‌రం తిరుప‌తిలోని విష్ణునివాసం వ‌స‌తి స‌ముదాయంలో టిటిడి వాటర్‌ వర్క్స్‌ విభాగం ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా ఆయుధ‌పూజ నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ శ్రీ మ‌నోహ‌రం, ఇతర వాటర్‌ వర్క్స్‌ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.