GARBA DANCE HYPNOTIZES DEVOTEES DURING SURYAPRABHA VAHANAM_ సూర్యప్రభ వాహనసేవలో మెరిసిన ‘గర్భ నృత్యం’
Tirumala, 29 September 2017: Garba dance by artists from Bangalore kept the devotees captivated in the galleries of four mada streets during the procession of Surya prabha Vahanam.
The dharmic and cultural wings of TTD-HDPP, Dasa sahitya, Annamacharya projects and SV music and dance college had streamlined artists from all over the country to present their talents infront of the Vahanams on Mada streets to enthrall the devotees.
The artists Sri Gopika bhajan mandali of Bangalore presented the Garba dance which is popular in Gujarat and West Bengal. Dressed in bright red banding print lehengas, they danced to rhythm even as a cute little girl as “Bala krishna” stood among them playing the flute, spectacularly presenting the episode of Sri Krishna Rasa leela.
The episode from Ramayanam where in the ears of Surpanakha were cut off by Lakshmana was aptly displayed by the artists of Sri Annamaiayya Saranagati seva Samiti led by Sri Rajamohan.
Artists of Sri Bhakta Prahalada bhajan mandali from Hubli in Karnataka dressed as Gods and Goddesses presented an alluring dance.
Similarly the artists of Sri Rama bhajan mandali of Karvetinagaram of Chittoor and also Malati troupe from Visakhapantam presented Chakka Bhajana, Pandari bhajana and Kolatam.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTDs,TIRUPATI
సూర్యప్రభ వాహనసేవలో మెరిసిన ‘గర్భ నృత్యం’
సెప్టెంబర్ 29, తిరుమల 2017: శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాల్లో ఏడో రోజైన శుక్రవారం ఉదయం సూర్యప్రభ వాహనసేవలో గర్భ నృత్యం తళుక్కున మెరిసింది. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన కళాబృందాల ప్రదర్శనలు భక్తులకు ఆహ్లాదాన్ని పంచాయి.
బెంగళూరుకు చెందిన శ్రీ గోపిక భజనమండలి ప్రదర్శించిన గర్భ నృత్యం భక్తులను ఆకర్షించింది. ఈ నృత్యాన్ని గుజరాత్, కోల్‌కతా రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రదర్శిస్తారు. ఎరుపురంగు సంప్రదాయ దుస్తుల్లో ఉన్న కళాకారులు లయబద్ధంగా నృత్యం చేయడం అలరించింది. మధ్యలో చిన్నికృష్ణుని వేషధారణలో ఒక కళాకారుడు చీరలెత్తుకెళుతున్నట్టుగా గొడుగుతో నిలిచి ఉండగా, కొందరు యువతులు గోపికల వేషధారణలో చీరల కోసం ప్రాధేయపడుతున్నట్టుగా నృత్యాన్ని ప్రదర్శించారు.
తిరుపతికి చెందిన శ్రీ రాజమోహన్ ఆధ్వర్యంలోని శ్రీ అన్నమయ్య శరణాగతి సేవా సంస్థ కళాకారులు శూర్పణఖ ముక్కు చెవులు కోసే ఘట్టాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. శ్రీసీతారామలక్ష్మణులు, శూర్పణఖ వేషధారణలు ఆకట్టుకున్నాయి. రామున్ని చూసి శూర్పణఖ మోహించడం, రాముని ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు వెంబడించి శూర్పణఖ ముక్కు, చెవులు కోయడాన్ని ఆసక్తికరంగా ప్రదర్శించారు.
కర్ణాటకలోని హుబ్లీకి చెందిన శ్రీ భక్త ప్రహ్లాద భజన మండలి మహిళా కళాకారులు శ్రీవేంకటేశ్వరుడు, శ్రీ వినాయకుడు తదితర దేవతల భక్తి పాటలకు ఆకర్షణీయంగా నృత్యం చేశారు. చిత్తూరు జిల్లా కార్వేటినగరానికి చెందిన శ్రీరామ భజనమండలి సభ్యుల చెక్కభజన ఆకట్టుకుంది. వీరు చెక్క భజన, పండరి భజన, కోలాట భజన చేశారు. అదేవిధంగా, వైజాగ్‌కు చెందిన మాలతి బృందం కళాకారుల కోలాటం కనులవిందుగా సాగింది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.