OUR MOBILITY AND CONNECTIVITY ARE WELL DESIGNED – TRANSPORT AND IT WINGS CHIEF SRI SESHA REDDY_ బ్రహ్మూెత్సవాల్లో భక్తులకు మెరుగైన రవాణా సేవలు : టిటిడి ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి

Tirumala, 29 September 2017: “We are related to mobility and connectivity, the two core aspects which are very much essential for the smooth run of affairs both on pilgrim front and administration and Transport as well IT departments have stood up to the expectation of devotees during the Brahmotsavams, said Sri PV Sesha Reddy, General Manager of Transport and Chief of IT services of TTD.

Addressing reporters at the Media center in Rambagicha rest house on Friday, he said, TTD has implemented IT related services to enhance efficiency as well transparency in many of its vital departments which has much pilgrim inter face. “IT has supported the premier user departments like Srivari temple, Reception, Srivari Seva in Public Relations, Vigilance and Security with reformed applications for better administration”, he maintained.

IT APPLICATIONS REDUCES PILGRIM WOES

He said the IT applications in Divya darshan, Special darshan and Sarva darshanam were well organised without hiccups and hardships to devotees.

TRANSPARENT SERVICES

In the Reception department, nearly 4000 rooms were made available on two tier systems on first come first served basis improving allotment and occupancy levels in the cottage allotment systems. Similarly the IT has also enabled transparent distribution of laddus in Laddu complex. The smooth movement of pilgrim crowd was ensured, issue of duty passes, work allotments, ID cards etc. done with IT assistance”, he observed.

TELUGU WEBSITE AND THREE DAY / FOUR DAY SEVA APPS.

“The launch of TTD website in Telugu version and improvised three-day, four-day slot for Srivari sevakulu are the two major IT applications successfully introduced during this Brahmotsavams”, he added.

ENSURED ZERO BREAK DOWN OR ACCIDENTS DURING BRAHMOTSAVAMS

In the capacity of General Manager of TTD Transport wing, Sri Sesha Reddy asserted that the department regulated travel plans of devotees with specific route maps especially on Garuda seva. ”

“We ensured zero percent break downs or accidents by taking enough road safety measures during Brahmotsavams so far”, he asserted.

DEDICATED SERVICES

Our fleet operation with 330 vehicles, Emergency Preparedness, Negotiation with APSRTC and Designing of Traffic Regulation Plan are the four major aspects efficiently death with to provide the best possible enhanced services to pilgrims during Brahmotsavams and especially during Garuda Seva”, he maintained.

EDP OSD Sri Balaji Prasad and Driving Inspector Sri Bhaskar Naidu were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTD,TIRUPATI

బ్రహ్మూెత్సవాల్లో భక్తులకు మెరుగైన రవాణా సేవలు : టిటిడి ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి

సెప్టెంబర్‌ 29, తిరుమల 2017: శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగ్గా రవాణా సేవలు అందించామని టిటిడి ట్రాన్స్‌పోర్టు జనరల్‌ మేనేజర్‌ శ్రీ శేషారెడ్డి తెలిపారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్‌లో శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ శేషారెడ్డి మాట్లాడుతూ తిరుమలలోని పలు ప్రాంతాలకు భక్తులను చేరవేసేందుకు ఉచిత బస్సులు, తిరుపతి – తిరుమల మధ్య తగినన్ని ఆర్‌టిసి బస్సులు ఏర్పాటచేసినట్టు తెలిపారు. టిటిడిలో 330 వాహనాలున్నాయని, వాటిని ఫిట్‌గా ఉంచుకుని వివిధ విభాగాల ద్వారా భక్తులకు సేవలందించామన్నారు. గరుడసేవ నాడు ఆర్‌టిసి అధికారులతో సమన్వయం చేసుకుని 4200 ట్రిప్పుల ద్వారా భక్తులను చేరవేశామని, కీలకమైన అన్నప్రసాదం, వైద్య విభాగాలకు తగినన్ని వాహనాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఘాట్‌ రోడ్లలో వాహనాల మరమ్మతులకు గురైనపుడు, ప్రమాదాలు జరిగినపుడు వెంటనే స్పందించేందుకు వీలుగా పలు ప్రాంతాల్లో ఆటోక్లినిక్‌లు, క్రెయిన్లతోపాటు ద్విచక్రవాహనాల మెకానిక్‌లను అందుబాటులో ఉంచామని వివరించారు. బ్రహ్మూెత్సవాల సందర్భంగా తిరుమలలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు తగిన భాగస్వామ్యం అందించామన్నారు.

ఐటి ద్వారా భక్తులకు పారదర్శక సేవలు : ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి

టిటిడిలోని కీలక విభాగాలకు సాంకేతిక సహకారం అందించి భక్తులకు మరింత పారదర్శకంగా సేవలు అందించేందుకు కృషి చేశామని ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి తెలిపారు. బ్రహ్మూెత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు చేతులమీదుగా టిటిడి వెబ్‌సైట్‌ తెలుగు వర్షన్‌ను ప్రారంభించామని, గరుడసేవ సందర్భంగా శ్రీవారి సేవలో 4 రోజులు, 3 రోజుల స్లాట్లను అదనంగా ప్రవేశపెట్టామని వివరించారు.

బ్రహ్మూెత్సవాల్లో విధుల నిర్వహణకు విచ్చేసిన పోలీసులకు, నిఘా, భద్రతా సిబ్బందికి డ్యూటీపాసులు, గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు సాంకేతిక సహకారం అందించినట్టు తెలిపారు. మీడియా సెంటర్‌లో కంప్యూటర్ల ఏర్పాటుతోపాటు టిటిడి వెబ్‌సైట్‌లో భక్తుల కోసం తాజా సమాచారాన్ని అందుబాటులో ఉంచుతున్నామన్నారు.

ఈ సమావేశంలో టిటిడి ప్రజసంబంధాల అధికారి డా|| టి.రవి, ఇడిపి ఓఎస్‌డి శ్రీ బాలాజి ప్రసాద్‌, సహాయ ప్రజాసంబంధాల అధికారిణి కుమారి పి.నీలిమ, డిఐ శ్రీ భాస్కర్‌నాయుడు ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.