LORD TO WOO DEVOTEES ON GARUDA VAHANA TWICE THIS MONTH_ జూలైలో రెండు సార్లు గరుడవాహనంపై శ్రీవారి దర్శనం

Tirumala, 5 July 2017: The devotees will enjoy double dhamaka this month as the Lord Malayappa Swamy will take celestial ride on Garuda Vahanam on twin auspicious occasions this month.

On July 9 being the Guru Pournima Day, the Lord will take celestial ride on Garuda Vahanam in four mada streets on this full moon day. While for the second time, the devotees will get an opportunity to witness Garuda Seva on July 28 as it happens to be the auspicious Garuda Panchami. The procession on both the occasions will be between 7pm and 9pm.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూలైలో రెండు సార్లు గరుడవాహనంపై శ్రీవారి దర్శనం

తిరుమల, 2017 జూలై 05: జూలైలో శ్రీవారు రెండుసార్లు గరుడ వాహనాన్ని అధిరోహించి భక్తులను కటాక్షించనున్నారు. జూలై 9వ తేదీ ఆదివారం గురుపౌర్ణమి సందర్భంగా గరుడసేవ వైభవంగా జరుగనుంది. భక్తుల కోసం ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టిటిడి గరుడసేవ నిర్వహిస్తోంది. ఇందులోభాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామివారు గరుడునిపై తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

అదేవిధంగా, జూలై 28వ తేదీన గరుడ పంచమి పర్వదినం సందర్భంగా ప్రత్యేకంగా గరుడసేవ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు పాల్గొంటారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.