PUSHPAYAGAM IN APPALAYAGUNTA ON JULY 11_ అప్పలాయగుంట శ్రీ ప్రసన్నవేంకటేశ్వరాలయ పుష్పయాగం గోడపత్రికలు ఆవిష్కరణ

Tirupati, 5 July 2017: The annual pushpayagam in Sri Prasanna Venkateswara Swamy temple at Appalayagunta will be observed on July 11 and Tirupati JEO Sri P Bhaskar released the posters for the same in his chambers in TTD administrative building on Wednesday.

Temple Spl Gr Dy E O Sri Munirathnam Reddy, Temple Inspector Sri Srinivasa Raju were also present.

Meanwhile in connection with this religious event there will be Rutwik Varnam followed by Medini Puja and Ankurarpanam on July 10. Snapana Tirumanjanam will be performed to deities on July 11 morning followed by Pushpayagam between 3pm to 6pm on the same day evening.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అప్పలాయగుంట శ్రీ ప్రసన్నవేంకటేశ్వరాలయ పుష్పయాగం గోడపత్రికలు ఆవిష్కరణ

తిరుపతి, 2017 జూలై 05:: టిటిడికి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయ పుష్పయాగం గోడపత్రికలను బుధవారం టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ జూలై 11వ తేదీన ఆలయంలో పుష్పయాగం జరుగనుందని తెలిపారు. ఈ ఆలయంలో జూన్‌ 6 నుంచి 14వ తేదీ వరకు బ్రహ్మూెత్సవాలు జరిగాయన్నారు. బ్రహ్మూెత్సవాల్లో ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారని వెల్లడించారు. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో ఇక్కడ పుష్పయాగం నిర్వహిస్తామని, పరిసర ప్రాంతాల భక్తులు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

జూలై 10వ తేదీ సోమవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఆచార్య రుత్విక్‌వరణం, సాయంత్రం 6.30 గంటలకు మేదినిపూజ, అంకురార్పణ నిర్వహిస్తారు. జులై 11న మంగళవారం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకు పుష్పయాగం కన్నులపండువగా జరుగనుంది. ఇందులో పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆ తరువాత వీధి ఉత్సవం నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ మునిరత్నంరెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శ్రీనివాసరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.