KAVACHA PRATISTA IN SRI GT

Tirupati, 5 July 2017: As a part of the ongoing three day Jyestabhishekam in Sri Govinda Raja Swamy temple Kavacha Pratistha was observed on Wednesday.

Earlier in the day snapana tirumanjanam was performed to the deities while in the evening they were taken on a celestial procession around the four mada streets on Tiruchi.

Tirumala Seers Sri Pedda Jiyar and Sri Chinna Jiyar Swamijis, temple DyEO Smt Varalakshmi and others were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా కవచ ప్రతిష్ఠ

తిరుపతి, 2017 జూలై 05: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్టాభిషేకంలో భాగంగా రెండో రోజు బుధవారం కవచప్రతిష్ఠ వైభవంగా జరిగింది. ప్రతి ఆషాఢ మాసంలో జ్యేష్టా నక్షత్రం నుంచి ఆలయంలో జ్యేష్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 10.00 గంటలకు ఆలయంలోని కల్యాణమండపంలో స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి కవచప్రతిష్ఠ చేశారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాఢ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్నజీయంగార్‌, టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ ప్రసాదమూర్తి రాజు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.