GARUDA GAMANA BLESSES DEVOTEES_ వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి గరుడసేవ

Tirupati, 25 May 2018: On the fifth day evening, Lord Sri Govinda Raja Swamy took celestial ride on Garuda Vahanam as a part of the ongoing annual Brahmotsavams.

All the streets in temple city of Tirupati are chock a block to witness the grandeur procession of Garuda Vahanam.

Golden Padalu: Earlier in the evening, the Golden Padalu reached the temple from Komalamma Satram in a celestial procession.

Pontiffs Sri Sri Sri Pedda Jeeyar Swamy, Sri Sri Sri Chinna Jeeyar Swamy, TTD EO Sri Anil Kumar Singhal, Tirupati JEO Sri Pola Bhaskar, Local temples DyEO Smt Varalakshmi, AEO Sri Udayabhaskar Reddy, Supdt, Sri Jnana Prakash and other temple officials and devotees took part in the procession of Garuda Vahana Seva.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి గరుడసేవ

తిరుపతి, 2018 మే 25: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన శుక్రవారం రాత్రి విశేషమైన గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 8.00 గంటల నుండి 10.00 గంటల వరకు తనకు ప్రీతిపాత్రమైన గరుడవాహనంపై స్వామివారు ఆలయ నాలుగు మాడవీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.

స్వామివారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శిస్తే మోక్షం కరతలామలకమని భక్తుల నమ్మకం. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుత్మంతుని రెక్కలు వేదం నిత్యత్వానికి, అపౌరుషషేయత్వానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. జ్ఞాన, వైరాగ్య ప్రాప్తిని కోరే మానవులు జ్ఞాన, వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగవదధిష్ఠుతుడైన గరుడుని దర్శించి అభీష్ఠసిద్ధి పొందుతారు. ఇందుకే గరుడసేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం విశిష్టత ఏర్పడ్డాయి.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమతి వరలక్ష్మి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.