LORD GOVINDARAJA RIDES ON HANUMANTHA VAHANAM_ హనుమంత వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి వైభవం

Tirupati, 26 May 2018: As part of the Day 6 of ongoing Brahmotsavam Lord Govindaraja blessed devotees as he rode on Hanumantha Vahanam on the four mada streets on Saturday morning. The event was marked by teeming devotees, bhajans, kolatas and holy music as devotees vied with each other to offer harati to their beloved deity.

Hanuman, as a Rama Bhakta was also symbol of intelligence, success, muscle power, commitment, health, indispensability and personality. Hence he is utilised as vahanam by Lord Venkateswara as Hanuman is also a symbol of concept of saranagati in the Sri Vaishnavite philosophy.

Later in the morning Snapana Thirumanjanam was performed to the utsava idols with milk, honey, curd, coconut water, sandal paste etc. In the evening Vasantotsavam was performed and parade on Bangaru Tiruchi was conducted. The Lord will ride on Gaja Vahanam at night and enthrall the devotees.

Pontiffs Sri Sri Sri Pedda Jeeyar Swamy, Sri Sri Sri Chinna Jeeyar Swamy, local temples DyEO Smt Varalakshmi, AEO Sri Udayabhaskar Reddy, Supdt Sri Jnana Prakash and other temple officials and devotees participated in the grand Brahmotsavam events throughout the day.

Cultural programs:

There has been tremendous response for cultural, sangeet, and Dharmic programs held as part of the ongoing Brahmotsavam of Sri Govindaraja temple.

In the early hours the artisans of SV Music and Dance College presented Mangala dwani. Later the Smt K. Indira troupe of Tirupati rendered Vishnu Sahasranamam and was followed by Purana pravachanam. In the evening Artisans of Annamcharya project rendered bhakti sangeet at the Unjal seva and the pushkarini at the Sri Govindaraja Temple. The troupe of Sri G Madhusudan Rao of Tirupati performed bhakti sangeet as well.

Later the Smt G. Krishna Kumari team performed bhakti sangeet at GR Temple pushkarini followed by Sri Burra Padmanabha Sharma harikatha parayanam at Annamacharya Kalamandir.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

హనుమంత వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి వైభవం

తిరుపతి, 2018 మే 26: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శనివారం ఉదయం గోవిందరాజస్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 7.00 నుండి 8.30 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

త్రేతాయుగంలో రామభక్తునిగా ప్రసిద్ధిగాంచినవాడు హనుమంతుడు. రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్త్వాన్ని బోధించినట్టు ప్రాచీనవాఙ్మయం నుండి తెలుస్తోంది. బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వం, ఆరోగ్యం, అజాడ్యం, వక్తృత్వం హనుమంతుని స్మరిస్తే లభిస్తాయి. అందువల్ల రాముని ప్రతిరూపమైన వేంకటేశ్వరుని హనుమంతుడు మోయడం ఉపపన్నమే. శరణాగతికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతారు.

అనంతరం ఉదయం 9.30 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్ళతో అభిషేకం చేశారు.

కాగా సాయంత్రం 4.00 నుండి 5.00 గంటల వరకు వసంతోత్సవం వైభవంగా జరగనుంది. అనంతరం సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు శ్రీవారు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతారు. రాత్రి 8.00 నుండి 9.30 గంటల వరకు గజ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

హైందవ సనాతన ధర్మంలో ప్రతి ఒక్క జంతువుకు ప్రాధాన్యత ఉంది. రాజసానికి ప్రతీక మదగజం. రణరంగంలో గానీ, రాజదర్బారులో గానీ, ఉత్సవములలో గానీ గజానిదే అగ్రస్థానం. సాక్షాత్తు సిరుల తల్లి లక్ష్మీదేవికి ఇష్టవాహనం అయిన గజవాహనం లక్ష్మీపతికి కూడా వాహనంగా విశిష్టసేవలు అందిస్తోంది.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ షడగోప రామానుజ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్‌స్వామి, టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమతి వరలక్ష్మి, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఉదయభాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ జ్ఞానప్రకాష్‌ ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సాంస్కృతిక కార్యక్రమాలు

శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం నిర్వహించిన ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు ఎస్‌.వి.సంగీత నృత్యకళాశాల వారిచే మంగళధ్వని, ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి కె.ఇందిర బృందం విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. సాయంత్రం 5.00 నుండి రాత్రి 7.00 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీజి.మధుసూధన్‌రావు బృందం భక్తి సంగీతం నిర్వహించనున్నారు.

శ్రీ గోవిందరాజస్వామివారి పుష్కరిణి వద్ద సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి జె.కృష్ణకుమారి బృందం భక్తి సంగీతం వినిపిస్తారు. అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు గుంటూరుకు చెందిన శ్రీబుర్రపద్మనాభశర్మ గారిచే హరికథ పరాయణం చేయనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.