SUBHAPRADHAM FOR BRIGHT FUTURE OF STUDENTS-TTD BOARD CHIEF_ భావి భారత నిర్మాణానికి నాంది ‘శుభప్రదం’ : టిటిడి ఛైర్మన్‌

TRAINING DHARMACHARYAS FROM THIS YEAR-JEO

Tirupati, 25 May 2018: Subhapradham is the training program on ethical values aimed at training the students to make them the best citizens of the country, said TTD Trust Board Chief Sri Putta Sudhakar Yadav.

Addressing the inaugural session of Subhapradham held at Mahati Auditorium in Tirupati on Friday evening, the Chairman said, the Hindu Dharma Prachara Parishad wing of TTD has been training the children of class 7, 8 and 9th since 2012 and making their future bright.

Tirupati JEO Sri P Bhaskar said, this year 92 faculties hailing from two Telugu speaking states were given training to teach students in Subhapradham. We want to make this as a year long program. In the month of June we will train 100 more “Dharmacharyas”. Through them we want to reach more number of students”, he maintained.

Pontiff of Brahmamgari Mutt Sri Sri Sri Veerajananda Swamy, Art Of Living from Vizag Sri Krishna Prasad addressed the students.

DPP Secretary Dr Ramana Prasad, Epic Studies Spl Officer Dr Damodar Naidu, Teachers and students took part.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భావి భారత నిర్మాణానికి నాంది ‘శుభప్రదం’ : టిటిడి ఛైర్మన్‌

శుభప్రదంలో శిక్షణ పొందిన విద్యార్ధులు ధర్మ ప్రచారానికి వారధులు : తిరుపతి జెఈవో

తిరుపతి, 2018 మే 25: పిల్లలకు భారతీయ సనాతన ధర్మం, మానవీయ, నైతిక విలువలు బోధించేందుకు ఉద్దేశించిన ‘శుభప్రదం’ వేసవి శిక్షణ తరగతుల కార్యక్రమం భావి భారత నిర్మాణానికి నాంది అని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టాసుధాకర్‌ యాదవ్‌ ఉద్ఘాటించారు. టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శుభప్రదం శిక్షణ కార్యక్రమం ప్రారంభ సమావేశం శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టిటిడి ఛైర్మన్‌ మాట్లాడుతూ మన పూర్వీకులు మనకు అందించిన సనాతన హైదవ ధర్మల సారాన్ని, అధ్యాత్మిక చింతను చిన్నతనం నుండి అలవర్చుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు. సమాజంలో నడుచుకోవాల్సిన తీరు, మానవత్వంతో వ్యవహరించాల్సిన విధానం, దైవత్వం సాధించేందుకు చేయాల్సిన కృషి తదితర విషయాలను ఈ శిక్షణలో విద్యార్థులకు బోధిస్తున్నట్టు తెలిపారు. టీనేజిలో ప్రతి మానవునిలో గొప్ప పరిణామం కలుగుతుందని, ఈ వయసులో నేర్చుకునే విషయాలు జీవితాంతం గుర్తుండిపోతాయని వివరించారు.

2012 నుండి గత 6 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్ధులకు శుభప్రదం శిక్షణా తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. తిరుపతిలో ఈ కార్యక్రమం మే 25 నుండి జూన్‌ 1వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రలకు చెందిన 7,8,9 తరగతుల బాలబాలికలకు తిరుపతిలోని 7 శిక్షణ కేంద్రాలలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు.

అంతకుముందు తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ప్రసంగిస్తూ శుభప్రదంలో శిక్షణ పొందిన విద్యార్ధులు ధర్మ ప్రచారానికి వారధులని, మీ ద్వారా సనాతన విలువలు ఎక్కువ మందికి వ్యాప్తి చెందాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత సమాజంలో ఆధ్యాత్మిక, మానవీయ విలువలు అడుగంటి పోతున్నాయని, వాటిని తిరిగి పెంపొందించేందుకు ఈ తరగతులు దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సనాతన సంప్రదాయ విలువలు పాటించే మంచి కుటుంబాన్ని తయారు చేయగలిగితే మంచి సమాజం తయారవుతుందన్నారు. విద్యార్థి దశలోనే ఇలాంటి విలువలను ఒంటబట్టించుకోవడం ద్వారా సమసమాజాన్ని స్థాపించే భావిభారత పౌరులుగా ఎదుగుతారని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం సంవత్సరం మొత్తం నిర్వహించి, ఎక్కువ మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకుగాను నూతనంగా ”ధర్మచార్యులను” ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సనాతన హైందవ ధర్మం భోదించేందుకు ఆసక్తి, సేవాభావం ఉన్నవారికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వీరి ద్వారా విడతల వారిగా అన్ని పాఠశాలలో శుభప్రదం శిక్షణ తరగతులు సంవత్సరం అంతా నిర్వహించనున్నట్లు వివరించారు. ధర్మచార్యులకు టిటిడి ఎలాంటి పారితోషకం ఇవ్వదని జెఈవో తెలిపారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జూన్‌ నెలలో 100 మంది ధర్మచార్యులకు శుభప్రదంపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వీరి ద్వారా ప్రతి నెల విడతల వారిగా మరింత మంది విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు.

అనంతరం కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలోని శ్రీ అచలానంద మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విరజానందస్వామి ప్రసంగిస్తూ నవ భారత నిర్మాణం ధార్మిక యువతతోనే సాధ్యమన్నారు. ధర్మాన్ని ప్రబోధించి ధార్మిక విలువలను జీవితానికి అనుసరణీయం చేసిన ఘనత ఒక్క హిందూ ధర్మానికిి మాత్రమే ఉందన్నారు. ప్రతి ఒక్కరు బాల్యం నుండి దైవభక్తి, పెద్దల యందు గౌరవం, క్రమశిక్షణ అలవర్చుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. ప్రసన్నమైన మనసుతో బతికితే బ్రహ్మాండమైన భవిష్యత్తుకు నాంది పలికిన వారవుతారని ఆయన విద్యార్థులకు సూచించారు.

అంతకుముందు విశాఖపట్నం ఆర్ట్‌ అఫ్‌ లివింగ్‌కు చెందిన శ్రీ కృష్ణప్రసాద్‌ విద్యార్థులకు శుభప్రదం గొప్పదనాన్ని వివిధ కథలలో తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ కార్యదర్శి డా|| రమణ ప్రసాద్‌, ఎపిక్‌ స్టడిస్‌ ప్రత్యేకాధికారి ఆచార్య దామోదరనాయుడు, ఇతర అధికారులు, అధ్యాపకులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.