GARUDALWAR BIDS ADIEU TO ALL DEITIES_ ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ వారి బ్రహ్మోత్సవాలు

GARUDA FLAG LOWERED

SRIVARI BRAHMOTSAVAMS COMES TO A CEREMONIAL CONCLUSION
Tirumala, 1 October 2017: The annual Brahmotsavam at Sri Vari temple came to a grand close with the `Dhwaja avarohanam’ observed inside Dhwaja Mandapam on Sunday evening.
Earlier processional diety of Lord Malayappaswamy along with His consorts were taken out in procession on gold tiruchi around four mada streets.
GARUDALWAR BIDS ADIEU TO ALL DEITIES
The Dhwajavarohanam marked the thanks giving gesture by Garudalwar, who bids adieu to all deities who participated in the nine day celestial even of Srivari Brahmotsavams in a ceremonial way.

GARUDA PATAKA LOWERED

The temple priests chanted the Vedic hymns and special Puja was performed to Dhwajasthambham, the temple pillar where the “Garuda Pataka” was hoisted on the first day of brahmotsavam.
SAPTA MANTRAS RECITED
Garuda Dhyanam, Bheri Puja, Bheri Tadanam, Garuda Gadyam, Dikpalaka Gadyam, Garuda Lagnastakam and Garuda Choornika, a total of seven mantras recited while lowering the Garuda Pataka on Sunday evening.

TTD EO Sri Anil Kumar Singhal, JEOs Sri KS Sreenivasa Raju, Sri Pola Bhaskar, CVSO Sri Ake Ravikrishna, Temple DyEO Sri Rama Rao and others took part.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTD,TIRUPATI

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ వారి బ్రహ్మోత్సవాలు

తిరుమల, 01 అక్టోబరు 2017: తిరుమల శ్రీ వారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి ధ్వజావరోహణంతో వైభవంగా ముగిశాయి.

ముందుగా రాత్రి 7.00 నుండి 9.00 గంటల మధ్య బంగారు తిరుచ్చి ఉత్సవం జరిగింది. రాత్రి 9.00 నుండి 10.00 గంటల మధ్య ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. ధ్వజారోహణం నాడు గరుడాళ్వార్ ఆహ్వానించిన దేవతలను తిరిగి సాగనంపే కార్యక్రమమే ధ్వజావరోహణం. తిరిగి వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఈ సందర్భంగా గరుడాళ్వార్ దేవతలను కోరతాడు. ఈ సందర్భంగా గరుడధ్యానం, భేరిపూజ, భేరితాడనం, గరుడగద్యం, దిక్పాలక గద్యం, గరుడ లగ్నాష్టకం, గరుడ చూర్ణిక అనే ఏడు మంత్రాలను అర్చకులు జపించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.