INCIDENT FREE BRAHMOTSAVAMS WITH THE BLESSINGS OF LORD AND SUPPORT OF PILGRIMS-TTD EO SRI ANIL KUMAR SINGHAL_ శ్రీవారి ఆశీస్సులు, భక్తుల సహకారంతో ప్రశాంతంగా సాలకట్ల బ్రహ్మూెత్సవాలు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
Tirumala, 1 October 2017: With the benign blessings of Lord Venkateswara and with the co-operation of multitude of pilgrims, the annual Brahmotsavams of Lord Venkateswara in Tirumala went off in a peaceful manner without any incident, said TTD Executive Officer Sri Anil Kumar Singhal.
After the completion of Chakra Snanam, the EO briefed the media persons about the highlights of Brahmotsavams 2017 along with Tirumala JEO Sri KS Sreenivasa Raju, CVSO Sri A Ravikrishna at Annamaiah Bhavan on Sunday.
He lauded the team work of TTD workforce, vigilance and security, APSRTC and Police towards the successful conduct of the mega nine day religious event. “Our Tirumala JEO did a lot of exercise with all senior officers of various departments to chalk out the plan for Brahmotsavams with his experience from the past three months. Both our CVSO Sri Ravikrishna and Tirupsti Urban SP Sri Abhishek Mohanty worked together to make this fete an incident free in spite of huge pilgrim turn out”, he complimented.
The EO also appreciated the services of Srivari Sevakulu, Scouts and Guides in offering services to pilgrims and the live coverage by SVBC where the mega event is being watched by millions of devotees across the globe. “The performance by different dance troops in front of vahanams is also commendable”, he added.
“This year every activity has been documented and we will continue the same in future too to enhance our pilgrim services. This year we have launched the Telugu version of TTD website during Brahmotsavams and 3-day, 4-day Seva online Srivari Seva applications are also launched. Next month we will launch Tamil and Kannada versions also”, he informed.
The EO also said, the Honourable CM of AP Sri N Chandrababu Naidu unveiled the 2018 TTD Calendar and Diary which are available in market both at Tirumala and Tirupati.
(THE STATEMENTS OF BRAHMOTSAVAM 2017 HIGH LIGHTS AND COMPARATIVE STATEMENT OF 2016 AND 2017 BRAHMOTSAVAM IS ALSO ATTACHED)
ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTD,TIRUPATI
శ్రీవారి ఆశీస్సులు, భక్తుల సహకారంతో ప్రశాంతంగా సాలకట్ల బ్రహ్మూెత్సవాలు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
అక్టోబరు 01, తిరుమల 2017: శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆశీస్సులు, విచ్చేసిన లక్షలాది మంది భక్తులు అందించిన సహకారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. భక్తులకు ప్రశాంతంగా శ్రీవారి మూలమూర్తి దర్శనంతోపాటు వాహనసేవలు తిలకించేలా ఏర్పాట్లు చేపట్టామని వివరించారు. బ్రహ్మూెత్సవాల చివరిరోజైన ఆదివారం చక్రస్నానం అనంతరం తిరుమలలోని అన్నమయ్య భవనంలో తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తుల సౌకర్యాలు, బ్రహ్మూెత్సవాల ఏర్పాట్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు పలు సూచనలు, సలహాలు ఇచ్చి ప్రోత్సహించారని, వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. ధ్వజారోహణం రోజు పట్టువస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన గౌ|| ముఖ్యమంత్రి టిటిడి వెబ్‌సైట్ తెలుగు వర్షన్, 2018వ సంవత్సరం టిటిడి క్యాలెండర్లు, డైరీలు ఆవిష్కరించారని వెల్లడించారు. లక్షలాది మంది భక్తులు సంయమనంతో వ్యవహరించి క్యూలైన్లు, గ్యాలరీల్లో వేచి ఉన్నారని, భక్తిభావంతో టిటిడికి సహకరించారని ఇందుకుగాను ధన్యవాదాలని తెలిపారు. తిరుమల జెఈవో శ్రీకె.ఎస్.శ్రీనివాసరాజు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి బ్రహ్మూెత్సవాలను విజయవంతం చేశారని అభినందించారు. భద్రతపరంగా ఎలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారని, టిటిడి విజిలెన్స్, పోలీసులు సమన్వయంతో వ్యవహరించారని, ఇందుకుగాను సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణకు, తిరుపతి అర్బన్ ఎస్పీ శ్రీ అభిషేక్ మహంతికి కృతజ్ఞతలు తెలియజేశారు.
బ్రహ్మూెత్సవాలకు విస్తృతంగా ప్రచారం కల్పించిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఈవో ధన్యవాదాలు తెలియజేశారు. భక్తులకు మెరుగైన సేవలు అందించిన టిటిడిలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బందికి, డెప్యూటేషన్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. శ్రీవారి ఆలయ అర్చకులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి చక్కగా స్వామివారి కైంకర్యాలు నిర్వహించారని చెప్పారు. ఎస్వీబీసీ నాణ్యమైన ప్రత్యక్ష ప్రసారాలను అందించిందని, బ్రహ్మూెత్సవాలకు రాలేని భక్తులు ఎస్వీబీసీలో స్వామివారి వైభవాన్ని తిలకించి తరించారని వివరించారు.
బ్రహ్మూెత్సవాల ముఖ్యాంశాలు
ఈ ఏడాది సాలకట్ల బ్రహ్మూెత్సవాల్లో 8 రోజుల్లో నమోదైన విశేషాలను ఈ సందర్భంగా ఈవో వివరించారు.
శ్రీవారి ఆలయం :
– 6.22 లక్షల మంది భక్తులు శ్రీవారి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు.
– 7.5 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచుకోవడమైనది.
– అమ్ముడుపోయిన మొత్తం లడ్డూలు 26.55 లక్షలు.
– హుండీ ఆదాయం రూ.18.71 కోట్లు.
– వగపడి ఆదాయం రూ.4.35 కోట్లు.
– ఆర్జితం ద్వారా రూ.6.34 లక్షలు ఆదాయం.
– స్థానికులతో కలిసి 3 లక్షల మందికిపైగా భక్తులు గరుడసేవనాడు స్వామివారిని దర్శించుకున్నారు.
నిఘా మరియు భద్రతా విభాగం :
– వాహనసేవలు, రథోత్సవం, చక్రస్నానంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 640 సిసిటివిలు, బాడివోర్స్ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లు.
– 2000 మంది టిటిడి విజిలెన్స్, పోలీసులు, ఒక ఎన్‌డిఆర్‌ఎఫ్ బ ందం, 400 మంది హోంగార్డులు, 4000 శ్రీవారి సేవకులు, 1000 మంది స్కౌట్స్, గైడ్స్ క్యాడెట్లను బ్రహ్మూెత్సవాల్లో గరుడసేవ విధులకు వినియోగించడమైనది.
– కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సిసిటివిల ద్వారా ముఖ్యమైన ప్రాంతాల్లోని భద్రతను పర్యవేక్షించాం.
– చిన్నపిల్లలు తప్పిపోకుండా 2 లక్షల జియోట్యాగ్‌లు.
విడిది విభాగం :
– భక్తులకు వసతి కల్పించడం వలన బ్రహ్మూెత్సవాల్లో ఎనిమిది రోజులకు గాను టిటిడికి వచ్చిన ఆదాయం రూ.1.32 కోట్లు.
– సామాన్య భక్తులకు అందుబాటులో ప్రతిరోజూ 4 వేల గదులు.
– ఆక్యుపెన్సీ రేటు 94 శాతంగా నమోదైంది.
– గదుల లభ్యత సమాచారాన్ని డిస్‌ప్లే బోర్డుల ద్వారా తెలియజేశాం.
కల్యాణకట్ట :
– తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య 3.06 లక్షలుగా నమోదైంది.
– 250 మంది మహిళా క్షురకులతో కలిపి మొత్తం 1400 మంది క్షురకులు 10 కల్యాణకట్టల్లో రోజుకు మూడు షిప్టుల్లో 24 గంటల పాటు భక్తులకు ఉచితంగా తలనీలాలు తీయడం జరిగింది.
అన్నప్రసాదం :
– బ్రహ్మూెత్సవాల ఎనిమిది రోజుల్లో 14.63 లక్షల భోజనాలు అందించడమైనది. 9.39 లక్షల టిఫిన్లు భక్తులకు అందించడమైనది.
– 15.71 లక్షల యూనిట్ల మజ్జిగ/పాలు/టీ/కాఫి భక్తులకు అందించడమైనది.
– గరుడసేవనాడు ఒకే రోజు 5.54 లక్షల మందికి అన్నప్రసాదాలు, అల్పాహారం, 4.18 లక్షల మందికి టి, కాఫి అందించడం జరిగింది.
– గరుడసేవనాడు తెల్లవారుజామున 1.30 గంటల వరకు భక్తులకు మాత శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదం పంపిణీ.
వైద్యం :
– బ్రహ్మూెత్సవాలకు అదనంగా 45 మంది డాక్టర్లు, 75 మంది పారామెడికల్ సిబ్బందిని వినియోగించడమైనది.
– తిరుమల, నడకదారుల్లో 76,366 మంది భక్తులకు వైద్యసేవలు.
ఆరోగ్య విభాగం :
– బ్రహ్మూెత్సవాల్లో ఆలయ నాలుగు మాడవీధులు, కాటేజీలు, యాత్రికుల వసతి సముదాయాలు, సామూహిక మరుగుదొడ్ల వద్ద మెరుగైన పారిశుద్ధ్యం కోసం 3200 మంది సిబ్బంది సేవలను వినియోగించడమైనది.
– భక్తుల సౌకర్యార్థం ఆలయ నాలుగు మాడ వీధుల్లో తాత్కాలిక, శాశ్వత కలిపి 29 మరుగుదొడ్లు ఏర్పాటు.
– గరుడసేవనాడు 100 టన్నుల చెత్త తొలగింపు.
ఇంజనీరింగ్ విభాగం :
– దాదాపు 1.80 లక్షల మంది భక్తులు కూర్చొని వాహనసేవలు వీక్షించేందుకు వీలుగా గ్యాలరీలు ఏర్పాటు.
– భక్తుల కోసం వివిధ ప్రాంతాల్లో సూచికబోర్డు, ఫ్లెక్సీలు, రూట్‌మ్యాప్‌లు.
– ఒ కోటి లీటర్ల శుద్ధి చేసిన నీటిని శ్రీవారి పుష్కరిణిలో నింపడమైనది.
– వాహనాలు తిరిగే నాలుగు మాడ వీధుల కూడళ్లలో భజన మండపాలు ఏర్పాటు. 252 తాగునీటి కొళాయిల ఏర్పాటు. వివిధ ప్రాంతాల్లో ఆర్‌ఓ తాగునీటి ప్లాంట్లు.
– చక్రస్నానం కోసం పుష్కరిణిలో ప్రత్యేక క్యూలైన్లు.
– బ్రహ్మూెత్సవాల్లో 289 లక్షల గ్యాలన్ల నీటి వినియోగం.
– తిరుపతిలోని దేవలోక్, శ్రీవారిమెట్టు, అలిపిరి వద్ద కార్లు, ద్విచక్రవాహనాలకు పార్కింగ్ వసతి.
– భక్తులను ఆకర్షించే రీతిలో దాదాపు 44 దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లను రూపొందించారు.
– మాడ వీధులతో పాటు వివిధ ప్రాంతాల్లో భక్తులు వాహనసేవలను వీక్షించేందుకు వీలుగా 30 ప్రాంతాల్లో ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటు.
హిందూ ధర్మప్రచార పరిషత్, ఇతర ప్రాజెక్టులు :
– శ్రీవారి బ్రహ్మూెత్సవాల్లో మొత్తం హిందూధర్మప్రచార పరిషత్తు, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, న త్య కళాశాల ఆధ్వర్యంలో 1500 మంది కళాకారులు వివిధ రకాల ప్రదర్శనలిచ్చారు.
– ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, రాజస్థాన్ రాష్ట్రాల కళాకారులు వాహనసేవల ముందు, తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపం, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరంలో ప్రదర్శించిన కళాక తులు విశేషంగా అకట్టుకున్నాయి.
– ఈ వేదికలపై ప్రముఖ కళాకారులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్, శ్రీ జెఎస్.ఈశ్వర్‌ప్రసాద్, శ్రీమతి ఉష, శ్రీ అయికుడి కుమార్, శ్రీమతి తంగమణి కుట్టి తదితరులు సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహించారు.
ఉద్యానవన విభాగం :
– శ్రీవారి ఆలయంలో శోభాయమానంగా పుష్పాల అలంకరణలు.
– పౌరాణిక అంశాలతోపాటు రంగురంగుల పుష్పాలతో పుష్పప్రదర్శనశాల.
– శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి ఫలాలు, పుష్పాల అలంకరణతో స్నపనతిరుమంజనం.
– పలు కూడళ్లు, అతిథిగ హాల వద్ద పుష్పాలంకరణలు.
– బ్రహ్మూెత్సవాల్లో మొత్తం 60 టన్నుల పుష్పాల వినియోగం.
ప్రజాసంబంధాల విభాగం :
– తిరుమలలో రాంభగీచా-2లో ఏర్పాటుచేసిన మీడియా సెంటర్‌లో ఫోను, ఇంటర్నెట్ వసతి కల్పించడం ద్వారా మీడియా ప్రతినిధులతో బ్రహ్మూెత్సవానికి తగిన ప్రచారం కల్పించడం జరిగింది.
– 2018వ సంవత్సరం టిటిడి క్యాలెండర్లు, డైరీలు, టిటిడి వెబ్‌సైట్ తెలుగు వర్షన్‌ను బ్రహ్మూెత్సవాల మొదటిరోజైన సెప్టెంబరు 23న గౌ|| రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు ఆవిష్కంచారు.
– గరుడసేవ నాడు శ్రీవారి సేవ 3 రోజులు, 4 రోజులు స్లాట్లను ప్రవేశపెట్టడం జరిగింది.
– టిటిడి 20 లక్షల 12 పేజీల క్యాలెండర్లు, 12 లక్షల డైరీలు(పెద్దవి 9 లక్షలు, చిన్నవి 3 లక్షలు), శ్రీవారి పెద్దక్యాలెండరు, శ్రీపద్మావతి, శ్రీవారి క్యాలెండరు, తెలుగు పంచాంగం క్యాలెండర్ కలిపి మొత్తం 17 లక్షలు ముద్రించడం జరిగింది. ఇవి తిరుమల, తిరుపతిలో అందుబాటులో ఉన్నాయి.
– భక్తుల కొరకు తిరుపతి, తిరుమలలో పుస్తక విక్రయశాలలు ఏర్పాటు. సి.డిలు, డి.వి.డిలు, వివిధ భాషా పుస్తకాలు భక్తులకు అందుబాటులో ఉంచడమైనది.
– టిటిడి ప్రచురణల విక్రయం ద్వారా రూ.33.12 లక్షల ఆదాయం సమకూరింది.
– బ్రహ్మూెత్సవాల వాహనసేవలు, స్నపనతిరుమంజనం తదితర కార్యక్రమాలతోపాటు ప్రత్యేక కథనాలకు సంబంధించి ప్రతిరోజూ 12 పత్రికా ప్రకటనలను ఈ-మెయిల్, వెబ్ ఫార్మాట్, వాట్సాప్‌లో పత్రికలు, ఛానళ్లకు అందించడం జరిగింది.
– దేశం నలుమూలల నుండి విచ్చేసిన 4000 మంది శ్రీవారి సేవకులతో భక్తులకు సేవలు.
– శ్రీవారి సేవకుల ద్వారా గరుడసేవనాడు ఆహారపొట్లాల తయారీ. మాడ వీధులతోపాటు క్యూలైన్లలోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, మజ్జిగ, తాగునీరు పంపిణీ.
మహాప్రదర్శన :
– తిరుమలలోని కల్యాణవేదిక వద్ద ”మహాప్రదర్శన” పేరిట ఉద్యానవన విభాగం, ప్రజాసంబంధాల విభాగం, ఎస్వీ మ్యూజియం, ఆయుర్వేద కళాశాల, శిల్పకళాశాల ఆధ్వర్యంలో భక్తులను ఆకట్టుకునేలా ప్రదర్శనశాలలు.
– తిరుమల చరిత్రను తెలిపేలా ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను రోజుకు 22 వేల మంది భక్తులు సందర్శించారు.
ఎస్వీ గోసంరక్షణశాల :
– శ్రీవారి వాహనసేవల్లో సర్వాంగసుందరంగా ముస్తాబు చేసిన ఏనుగులు, అశ్వాలు, వ షభాల వినియోగం.
– జంతువుల సహాయకులు ప్రత్యేక వస్త్రధారణలో గొడుగులతో వాహనసేవలకు మరింత వన్నె తెచ్చారు.
– జంతువుల వద్ద నైపుణ్యం గల శిక్షకుల ఏర్పాటు.
శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ :
– శ్రీవారి బ్రహ్మూెత్సవ వైభవాన్ని భక్తుల కళ్లకు కట్టేలా శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌లో మరింత మెరుగ్గా వాహనసేవలు, ఇతర కార్యక్రమాలను రోజుకు 15 గంటల పాటు ప్రత్యక్ష ప్రసారం.
– వాహనసేవల విశిష్టత అన్ని భాషల వారికి తెలిసేందుకు వీలుగా ప్రముఖ పండితులతో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వ్యాఖ్యానాలు.
– సామాజిక మాధ్యమాల ద్వారా బ్రహ్మూెత్సవాలను ఎక్కువ మంది వీక్షించేందుకు ఏర్పాట్లు.
– అధునిక సాంకేతిక పరిజ్ఞానం గల 13 హెచ్‌డి కెమెరాలు, 3 జిమ్మి జిప్‌లతోపాటు నిపుణులైన కెమెరామెన్లను ఉపయోగించడమైనది.
ఇతరములు :
– టిటిడి ఐటి విభాగం అధునాతన పరిజ్ఞానంతో వేగవంతమైన సేవలందించడం ద్వారా భక్తులు దర్శనం, వసతి ఇతర సేవలను మరింత సౌకర్యవంతంగా పొందగలిగారు.
– శ్రీవారి సేవలో యువతను, ఉద్యోగులను మరింత ప్రోత్సహించేందుకు 3 రోజులు, 4 రోజుల స్లాట్ల కోసం గరుడసేవ రోజున నమోదు ప్రక్రియను ప్రారంభించాం.
– ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సులు తిరుపతి నుంచి తిరుమలకు 4.26 లక్షల మంది భక్తులను చేరవేశాయి. తిరుమల నుంచి తిరుపతికి 5.66 లక్షల మంది భక్తులను చేరవేశాయి.
– తిరుమలలో 7 వేల వాహనాలకు, తిరుపతిలో 2500 వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు.
– టిటిడి విభాగాలతోపాటు జిల్లా యంత్రాంగం, పోలీసు, ఎన్‌డిఆర్‌ఎఫ్, అగ్నిమాపక విభాగాలు, ఎపిఎస్‌పిడిసిఎల్, ఎపిఎస్‌ఆర్‌టిసి, ఆర్‌టిఓ, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు, సిబ్బంది బ్రహ్మూెత్సవాల్లో భక్తులకు విశేష సేవలందించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.