GODA PARINAYAM HELD IN SRI GT _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా గోదా పరిణయోత్సవం
Tirupati, 16 Jan. 20: The annual Goda Parinayotsavam was held in the ancient temple of Sri Govindaraja Swamy in Tirupati on Thursday.
After awakening the deity with Suprabhatam and Sahasranamarchana, the Melchat vastram, garlands from Pundarikavalli Tayar Sannidhi was taken to Sri Andal Ammavaru Sannidhi in a procession. Later Asthanam was performed to Andal in Sri Lakshminarayana Swamy temple.
After on, Sri Andal was taken to Alwar Tirtham located in Kapilatheertham in a procession and returned back to the temple. In the evening, Goda Parinayotsavam was performed.
Special Grade DyEO Smt Varalakshmi and others were also present.
KOORATHALWAR SATTUMORA
Sri Koorathalwar Sattumora was performed in Sri Govindaraja Swamy temple at Tirupati on Thursday.
Koorathalwar was born as Kuresan in a small hamlet ‘Kooram’ near Kanchipuram in Tamilnadu in the year of 1010 A.D.and was one of the most important disciples of Sri Vaishnava Saint Sri Ramanujacharya.
The processional deities of Sri Govindaraja Swamy, accompanied by Sridevi and Bhudevi reached Koorathalwar Sanndhi and Sattumora was performed.
PARUVETA UTSAVAM ON JAN 17
The Paruveta Utsavam in Sri Govindaraja Swamy temple will be observed on January 17.
The processional deities of Sri Govindaraja Swamy, accompanied by Sridevi and Bhudevi will be taken to Paruveta Mandapam located at Renigunta and Asthanam will be performed.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా గోదా పరిణయోత్సవం
తిరుపతి, 2020 జనవరి 16: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం గోదా పరిణయోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఇందులోభాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, సహస్రనామార్చన చేపట్టారు. అనంతరం ఉదయం 5 గంటలకు శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి ఆలయం నుండి మేల్‌ఛాట్ వస్త్రం, పూలమాల ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ ఆండాళ్ అమ్మవారికి సమర్పించారు. అనంతరం ఆండాళ్ అమ్మవారికి శ్రీ లక్ష్మీనారాయణస్వామివారి ఆలయంలో ఆస్థానం నిర్వహించారు.
తరువాత శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయం నుండి కపిలతీర్థంలోని ఆళ్వార్ తీర్థానికి ఊరేగింపుగా తీసుకువెళ్లి కపిలతీర్థం నుండి పిఆర్ తోట మీదుగా తిరిగి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకున్నారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు గోదా పరిణయోత్సవం నిర్వహిస్తారు.
శ్రీ కూరత్తాళ్వార్ శాత్తుమొర –
శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం శ్రీ కూరత్తాళ్వార్ శాత్తుమొర ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శాత్తుమొర సందర్భంగా రాత్రి 7 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు శ్రీ కూరత్తాళ్వార్ సన్నిధికి వేంచేపు చేస్తారు. అక్కడ సేవాకాలం, శాత్తుమొర, ఆస్థానం చేపడతారు.
జనవరి 17న పార్వేట ఉత్సవం
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 17న శుక్రవారం పార్వేట ఉత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా మధ్యాహ్నం 3.30 నుండి 6 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని, శ్రీ ఆండాళ్ అమ్మవారిని మాడ వీధుల గుండా ఊరేగింపుగా రేణిగుంట రోడ్డులోని పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఆస్థానం నిర్వహిస్తారు. అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఇఓ శ్రీ రవికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ రాజ్‌కుమార్, శ్రీ శర్మ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ కృష్ణమూర్తి, శ్రీ మునీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.