GODDESS PADMAVATHI APPEARS AS LORD PATTABHIRAMA ON HANUMAD VAHANAM_ హనుమంత వాహనంపై పట్టాభిరామునిగా అమ్మవారు

Tiruchanur, 18 November 2017:The Universal Mother appeared in the Alankara of Lord Sri Pattabhirama on Hanumantha Vahanam on Saturday evening.

As a part of the ongoing annual brahmotsavam fete, on fourth day evening the Goddess adorned the incarnation of Lord Pattabhirama and took celestial ride on the noblest carrier Hanumantha along the mada streets encircling the temple in Tiruchanoor.

The devotees were delighted by the sight of Goddess taking a majestic ride on Hanumantha Vahana.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

హనుమంత వాహనంపై పట్టాభిరామునిగా అమ్మవారు

తిరుపతి,18 నవంబరు 2017; తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో శనివారం రాత్రి పట్టాభిరామునిగా అమ్మవారు దర్శనమిచ్చారు. రాత్రి 8.00 నుండి 10.00 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు హనుమంత వాహనంపై భక్తులకు కనువిందు చేశారు.

హనుమంతుడు శ్రీరామచంద్రునికి అనన్యభక్తుడు. త్రేతాయుగంలో శ్రీవారు శ్రీరాముడిగా అవతరించారు. ఆదిలక్ష్మి అలమేలుమంగమ్మ సీతగా మిథిలానగరంలో అవతరించి, స్వామిని వివాహమాడింది. ఆ సీతామాత కలియుగంలో పద్మావతిగా అవతరించింది. తన జాడను శ్రీవారికి తెలిపిన మహాభక్తుడైన ఆంజనేయుని కోరికను తీర్చడానికా అన్నట్టు అలమేలుమంగ బ్రహ్మోత్సవాలలో హనుమంతున్ని వాహనంగా చేసుకుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.