TTD TO OPEN ONLINE REGISTRATION FOR SPECIAL OCCASION SRIVARI SEVA ON NOV 20 FOR V-DAY
AGE GROUP BETWEEN 25Y-40Y ONLY
INDIVIDUAL REGISTRATION -AADHAAR MANDATORY
Tirumala , 18 November 2017: To provide an opportunity to more number of employed and youth to offer services to pilgrims during Vaikuntha Ekadasi and Dwadasi, TTD will release online srivari seva quota on November 20.
Already TTD had introduced three day and four day quota in online along with week long service. To enable more youngsters to offer better services for the upcoming important festival on December 29, TTD has provided this opportunity to sevakulu falling under this age limit.
Some important guidelines for online registration:
Aadhaar manadatory for online registration.
Age limit is between 25 years to 40 years.
Quota limit is 300.
Service will be for two days on December 29 and 30 with reporting day in seva sadan on December 28.
Only individual registration on the lines of Parakamani and laddu sevas.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
నవంబరు 20న శ్రీవారి సేవ ‘ప్రత్యేక సందర్భాల’ స్లాట్ విడుదల
తిరుమల 18 నవంబరు, 2017 ;తిరుమల శ్రీవారి దర్శనార్థం పర్వదినాల రోజుల్లో విశేషంగా విచ్చేసే భక్తులకు సేవలందించేందుకు ఉద్దేశించిన శ్రీవారి సేవ ”ప్రత్యేక సందర్భాల” స్లాట్‌ను నవంబరు 20వ తేదీన విడుదల చేయనున్నారు. ఇందులో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు సేవలందించేందుకు అదనంగా 300 మందికి శ్రీవారిసేవ చేసే అవకాశం కల్పిస్తారు. వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, శ్రీవారి బ్రహ్మూెత్సవాలు లాంటి రద్దీ సమయాల్లో ”ప్రత్యేక సందర్భాల” స్లాట్ ద్వారా భక్తులకు సేవలందించవచ్చు.
ప్రస్తుతం శ్రీవారి సేవలో 7 రోజులు, 3 రోజులు, 4 రోజుల స్లాట్లలో సేవలందించేందుకు ఆన్‌లైన్ అప్లికేషన్‌లో మార్పులు తీసుకురావడం జరిగింది. 3 రోజుల స్లాట్‌కు సంబంధించి 25 నుంచి 40 ఏళ్ల లోపు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తారు. 4 రోజులు, 7 రోజుల స్లాట్లకు 18 నుంచి 60 ఏళ్లలోపు వారిని అనుమతిస్తారు. ఈ మూడు స్లాట్లు కాకుండా తాజాగా ప్రత్యేక సందర్భాల్లో భక్తులకు సేవలందించేందుకు 25 నుంచి 40 ఏళ్లలోపు గలవారికి 3 రోజుల పాటు సేవ చేసే అవకాశం కల్పించనున్నారు. 7 రోజుల స్లాట్‌కు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశముంది. 3 రోజులు, 4 రోజులు, ప్రత్యేక సందర్భాల స్లాట్లకు సంబంధించి ఆన్‌లైన్ ద్వారా మాత్రమే నమోదు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో భక్తులు తప్పనిసరిగా ఆధార్ నంబరుతో శ్రీవారి సేవకు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సేవకు రిపోర్టు చేసే సమయంలో ఆధార్ కార్డును వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
3 రోజుల స్లాట్‌కు వచ్చేవారు గురువారం రిపోర్టు చేయాలి. శుక్ర, శని, ఆదివారాల్లో సేవ చేయాల్సి ఉంటుంది. 4 రోజుల స్లాట్‌కు వచ్చేవారు ఆదివారం రిపోర్టు చేయాలి. సోమ, మంగళ, బుధ, గురువారాల్లో సేవలందించాల్సి ఉంటుంది. 7 రోజుల స్లాట్‌కు వచ్చేవారు మంగళవారం రిపోర్టు చేయాలి. బుధ, గురు, శుక్ర, శని, ఆది, సోమ, మంగళవారాల్లో సేవ చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక సందర్భమైన వైకుంఠ ఏకాదశికి సంబంధించి డిసెంబరు 28న రిపోర్టు చేయాలి. డిసెంబరు 29, 30వ తేదీల్లో సేవ చేయాల్సి ఉంటుంది.
టటిడి వెబ్‌సైట్ www.tirumala.orgలో ‘శ్రీవారిసేవ’ అనే లింక్‌ను క్లిక్ చేసి ఇతర వివరాలను తెలుసుకోవచ్చు.
విడివిడిగా నమోదు చేసుకోవాలి:
”ప్రత్యేక సందర్భాల” శ్రీ వారిసేవ ఆన్ లైన్ స్లాట్ కోసం విడివిడిగా భక్తులు నమోదు చేసుకోవాలి.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.