మే లో శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

మే లో శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

మే 01, తిరుపతి, 2018: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మే నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

– మే 4, 11, 18వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.

– మే 7న శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5.30 గంటలకు శ్రీభూ సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు.

– శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మూెత్సవాల సందర్భంగా మే 16న ఉదయం 6.00 నుండి 8.30 గంటల వరకు ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు.

– మే 17న రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని రుక్మిణి సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

– శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు మే 20న సాయంత్రం 6.30 గంటలకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ నిర్వహిస్తారు.

– మే 21 నుండి 29వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు.

– మే 30న ద్వాదశారాధన, పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 4.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు స్నపనతిరుమంజనం, ఆస్థానం, పౌర్ణమి పూలంగి సేవ నిర్వహిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.