పదో తరగతి ఫలితాల్లో శ్రీ కోదండరామస్వామి ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రతిభ

పదో తరగతి ఫలితాల్లో శ్రీ కోదండరామస్వామి ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రతిభ

మే 01, తిరుపతి, 2018: టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ కోదండరామస్వామి ఇంగ్లీష్‌ మీడియం ఉన్నత పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. మొత్తం 86 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 85 మంది ఉత్తీర్ణత సాధించారు. 98.8 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

ఎం.నాగేష్‌ నాయక్‌ 10, ఎన్‌.యశస్విని 10, టి.భానుప్రకాశ్‌రెడ్డి 9.8 గ్రేడ్‌ పాయింట్లు సాధించారు. 10 గ్రేడ్‌ పాయింట్లు ఇద్దరు, 9 నుండి 10 గ్రేడ్‌ పాయింట్లలోపు 30 మంది, 8 నుండి 9 గ్రేడ్‌ పాయింట్లలోపు 32 మంది, 7 నుండి 8 గ్రేడ్‌ పాయింట్లలోపు 18 మంది, 6 నుండి 7 గ్రేడ్‌ పాయింట్లలోపు ముగ్గురు విద్యార్థులు ఉన్నారు.

ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కె.గీతాంజలి అభినందించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.