GRAND FINALE OF HOMA MAHOTSAVAMS AT SRI KAPILESWARA SWAMY TEMPLE_ శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా ముగిసిన హోమ మహోత్సవాలు

Tirupati, 7 Dec. 18: The month long conduction of Homa Mahotsavams at Sri Kapileswara Swamy Temple as a part of festivities in Karthika masam came to a grand conclusion on Friday with the Sri Chandikeswarar Homam and Trisoola Snanam.

As a part of the Visesha Homa Mahotsavams, the Archakas performed Sri Chandikeswara Homa in the morning followed by Maha Purnahuti, Kalasha Udwasana , Maha Shanti Abhisekam, Kalashabisekam, Trishoola Snanam and finally with Ankurarpanam Visarjanam.

In the evening laksha Deeparadhana and Sri Vigneswara Swamy, Sri Valli Devasena and Sri Subramanya swamy, Sri Kapileswara swamy, Sri Kamakshi, Sri Chandikeswarara Aradhana were performed. Later the utsava idols of all five deities were paraded on the streets of temple town.

The Tirupati JEO Sri Pola Bhaskar, DyEO Sri Subramanyam, Temple superintendent Sri Ajay Kumar, Temple priests Sri Swaminatha swamy, Maniswamy, Udayaswamy, Temple inspector Sri Muralikrishna, Sri Reddy Sekhar, other officials and devotees participated in the event.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా ముగిసిన హోమ మహోత్సవాలు

వైభ‌వంగా త్రిశూల‌స్నానం, పంచ‌మూర్తుల ఊరేగింపు

డిసెంబరు 07, తిరుప‌తి, 2018: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా నెల రోజుల పాటు నిర్వహించిన హోమ మహోత్సవాలు శుక్ర‌వారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం, త్రిశూల‌స్నానం నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం జరిగింది. అనంతరం మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మ‌హాశాంతి అభిషేకం, కలశాభిషేకం, త్రిశూల‌స్నానం, అంకురార్పణ విసర్జన నిర్వహించారు.

సాయంత్రం లక్షదీపారాధన, పంచమూర్తులైన శ్రీవిఘ్నేశ్వరస్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి, శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీచండికేశ్వరస్వామి వారికి ఆరాధన నిర్వహించనున్నారు. ఆ త‌రువాత పంచమూర్తులను పుర‌వీధుల్లో వైభ‌వంగా ఊరేగిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ దంప‌తులు, డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్‌, ఆలయ అర్చకులు శ్రీ స్వామినాథస్వామి, శ్రీ మణిస్వామి, శ్రీ ఉద‌య‌స్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ ముర‌ళీకృష్ణ‌, శ్రీ రెడ్డిశేఖ‌ర్‌ ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.