GRAND FINALE OF NIRATOTSAVAM OF SRI ANDAL AMMAVARU AT SRI GT _ ఘనంగా ముగిసిన శ్రీ ఆండాళ్‌ నీరాటోత్సవాలు

Tirupati, 13 Jan. 20: The weeklong Andal Nirotsavam, which began on January 7 at Sri Govindaraja Swamy temple, concluded on Monday.

As a part of the festivities the utsava idol of Sri Andal Ammavaru was taken out on a Bangaru Tiruchi to Sri Ramachandra Pushkarani and abhisekam was performed. 

Later in the evening the idols returned to the Sri GT temple.

Temple special grade DyEO Smt Varalakshmi, AEO Sri Ravi Kumar Reddy and others participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఘనంగా ముగిసిన శ్రీ ఆండాళ్‌ నీరాటోత్సవాలు

తిరుప‌తి, 2020 జనవరి 13: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళ్‌ అమ్మవారి నీరాటోత్సవాలు సోమ‌వారం ఘనంగా ముగిశాయి. జనవరి 7 నుండి శ్రీ ఆండాళ్‌ అమ్మవారికి నీరాటోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే.

ఈ సందర్భంగా ఉదయం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు బంగారు తిరుచ్చిపై శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి శ్రీ రామచంద్ర తీర్థ క‌ట్ట‌కు ఊరేగింపుగా చేరుకున్నారు. అక్కడున్న మండ‌పంలో అమ్మ‌వారిని కొలువుతీర్చి వేడినీళ్లతో అభిషేకం చేశారు. సాయంత్రం వరకు అమ్మవారు అక్కడే ఉండి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 4 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు బంగారు తిరుచ్చిపై శ్రీ కోదండరామాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఊరేగింపుగా తిరిగి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకున్నారు. భక్తులు అడుగుడుగునా హారతులు సమర్పించి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో ఆండాళ్‌ అమ్మవారు స్వామివారి కోసం చేసిన తపస్సుకు ప్రతీకగా ఈ ఉత్సవం నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వరలక్ష్మి, ఏఇఓ శ్రీ రవికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ రాజ్‌కుమార్‌, శ్రీ శర్మ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ కృష్ణమూర్తి, శ్రీ‌ మునీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.