GRANDEUR MARKS R-DAY CELEBRATIONS AT TIRUMALA _ త్యాగధనుల అడుగుజాడల్లో పయనిద్దాం : తిరుమల జెఈవో

TIRUMALA, 26 January 2013: Meanwhile, Tirumala JEO Sri KS Sreenivasa Raju hoisted the national flag in the premises of office of Vigilance and Security in Tirumala on Saturday on the occasion of 64 Republic Day.

Addressing the occasion he called upon the employees to memorise the great sacrifices done by the great souls who brought freedom to the country at the cost of their lives. “We should recall their efforts in getting independence and creating a Republican country for the people.

Let us pledge to make use of the “God-given” opportunity and dedicate ourselves in offering sincere services to the multitude of visiting pilgrims to Tirumala.

Additional CVSO Sri Shiva Kumar Reddy, Temple Dy E O Sri C Ramana, AVSOs Sri Appa Roy, Sri Vishwanath, Sri Koteswara Rao and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

     



త్యాగధనుల అడుగుజాడల్లో పయనిద్దాం : తిరుమల జెఈవో

తిరుమల, జనవరి 26, 2013: తిరుమలలో శనివారం నాడు నిఘా విభాగం ప్రాంగణంలో జరిగిన 64వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న తిరుమల జెఈఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలంగా లభించిన స్వాతంత్య్ర సార్వభౌమత్వ ఫలాలను వారందించిన స్ఫూర్తితో విధులు నిర్వర్తించాలని ఆయన ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న తిరుమల జెఈవో ఈ సందర్భంగా మాట్లాడుతూ నాడు స్వాతంత్య్ర సమరంలో ఎందరో త్యాగశీలురు దేశం కోసం తమ ప్రాణాలను సైతం ఒడ్డి ఈ స్వాతంత్య్ర ఫలాలను అందించారన్నారు. అనంతరం ప్రజల దగ్గరే ప్రభుత్వం ఉండాలన్న ఆకాంక్షతో సార్వభౌమత్వాన్ని కూడా మనం జనవరి 26, 1950వ సంవత్సరంలో సాధించామన్నారు. నేడు మనం సుఖాలను అనుభవిస్తున్నామంటే నాటి త్యాగశీలుర ఫలమేనని ఆయన అన్నారు.
తితిదే ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ వ్యవహారాలను చూసుకుంటున్న అతిపెద్ద ధార్మిక సంస్థ అన్నారు. భక్తులకు సేవ చేయడమే పరమావధిగా తితిదే ఉద్యోగులు తమ విధులను చిత్తశుద్ధితో నిర్వహించాలన్నారు. విమర్శలకు వెరవకుండా శాయశక్తులా విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. భక్తుల సేవే భగవంతుని సేవగా ప్రతినబూని ప్రతి ఒక్క తితిదే ఉద్యోగి తమకు పూర్వజన్మ సుకృత ఫలంగా లభించిన ఈ సదవకాశాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
ఈ గణతంత్ర దినోత్సవంలో అదనపు ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ శివ కుమార్‌రెడ్డి, ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ చిన్నంగారి రమణ, ఆరోగ్య శాఖాధికారి శ్రీ భీష్మయ్యనాయుడు, ఏవీఎస్‌వోలు శ్రీ అప్పారాయ్‌, శ్రీ కోటేశ్వరరావు, శ్రీ విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.