TTD PUBLICATIONS GARNER HUGE RESPONSE IN PWD GROUNDS_ విజయవాడలోని శ్రీవారి నమూనా ఆలయంలో ‘టిటిడి పుస్తక విక్రయశాల’కు విశేష ఆదరణ

Vijayawada, 6 July 2017: The TTD publications stalls put up at the model Srivari temple in the PWD grounds of Vijayawada for the ongoing Sri Venkateswara Vaibhavotsavams was a major hit with large number of foot falls.

Publications highlighting the devotion and glory of Lord Venkateswara and other Hindu dharmic subjects and Indian cultural traditions besides children’s books published by TTD were sold out in large numbers.

The Valmiki Ramayanam comprising eight volumes at a cost of Rs.1520/-, Pothana Bhagavatham pricing Rs.1260/- including eight volumes, Annamaiah Pada kosam, Tirumala Brahmtosava Vaibhavam etc, sold by TTD at good concessions were in large demand.

500 other publications are also available on the shelf for devotees in book stall. Apart from the publications over 100 CDs are kept for sale produced by the SV Recording Project, Veda Bhashyam, Sundarakanda, Annamaiah sankeertans, Annamaiah Pataku Pattabhisekam etc. are also readily available for denizens.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

విజయవాడలోని శ్రీవారి నమూనా ఆలయంలో ‘టిటిడి పుస్తక విక్రయశాల’కు విశేష ఆదరణ

విజయవాడ , 2017 జూలై 06: విజయవాడలోని పి.డబ్ల్యు.డి. గ్రౌండ్స్‌లో శ్రీవారి నమూనా ఆలయం ప్రాంగణంలో టిటిడి ప్రచురణల విక్రయ విభాగం అధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘పుస్తక విక్రయశాలకు’ భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. శ్రీవారి వైభవాన్ని తెలిపే పుస్తకాలతో పాటు అనేక ధార్మిక విషయాలు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు సంబందించిన పుస్తకాలు, పిల్లల నుండి పెద్దల వరకు ఆకట్టుకుంటున్నాయ.

టిటిడి పుస్తక విక్రయశాలలో అపురూపమైన వాల్మీకి రామాయణం 8 పుస్తకాలు రూ.1520/-, పోతన భాగవతము 8 పుస్తకాలు రూ.1260/-, అన్నమయ్య పదకోశం రూ.140/-, తిరుమల బ్రహ్మోత్సవ ప్రాభవం రూ.250/-, పండుగలు- పరమార్థములు రూ.85/-, శ్రీవేంకటేశ్వరవైభవం రూ.65/-, హరికొలువు రూ.55/-, సిరికొలువు రూ.40/-,తిరుమల ఆలయాలకు సంబంధించిన శాసనాలు (ఇంగ్లీషు) రూ.495/-, శ్రీవారి హుండీలో బంగారు, వెండి నాణేలు(తెలుగు, ఇంగ్లీషు) రూ.2000/- తదితర పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.

టిటిడి నూతనంగా ముద్రించిన భగవద్గీత రూ.175/-, భగవత్‌ కథా సుధ రూ.30/-, శ్రీకృష్ణ యజుర్వేదం రూ.195/-(9వ భాగాము), శ్రీచక్ర విశేషపూజ రూ.65/-, బ్రహ్మవిద్య రూ.15/-, పుష్కరకృష్ణ రూ.200/-, పుస్తకాలున్నాయ. ప్రత్యేకంగా చిన్నపిల్లల కొరకు బొమ్మలతో కూడిన శ్రీనివాస చరితం, గీత గోవింద కావ్యం, రామాయణం ఉన్నాయ.

అంతేగాక సంస్కృత భాగవతము, కృష్ణ యజుర్వేదం, అధర్వణవేద భాష్యం, యజుర్వేద భాష్యం, నీతికథలు, పురాణాలు, రామాయణం, శ్రీమద్భాగవతం, సుందరకాండ, ఆనందనిలయం, ఏడుకొండలు తదితర 107 రకాల తెలుగు, 36 రకాల ఇతర భాషల ఆధ్యాత్మిక గ్రంథాలు పాఠకులను ఆకట్టుకుంటున్నాయి.

టిటిడి శ్రీ వేంకటేశ్వర రికార్డింగ్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పేరిట 16 సిడిలు రూ.480/-, ‘అన్నమయ్య బాల గానామృతం’ పేరిట 10 రకాల సిడిలు రూ.300/-, అన్నమయ్య 600 సంకీర్తనల డివిడి రూ.40/-, శ్రీ గంగాధరశాస్త్రి గానం చేసిన 700 శ్లోకాల సంపూర్ణ ”శ్రీమద్భగవద్గీత” 18 డివిడిలు రూ.1800/- చొప్పున ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

శ్రీమతి ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి, శ్రీమతి శోభారాజ్‌, శ్రీ గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌ వంటి ప్రముఖ గాయకులు ఆలపించిన సంకీర్తనలు 100 రకాల సి.డి.లు రూ.30/-, ‘శ్రీవేంకటేశ్వర వైభవం’, ‘కొండపైన పుణ్యతీర్థాలు’ దృశ్యకావ్యాలు రూ.40/-, ‘అన్నమయ్య గోవిందగానం’, ‘అన్నమయ్య నాదనివేదన’, ‘రెండు సిడిలలో మొత్తం 1200 అన్నమయ్య కీర్తనలు’, ‘శ్రీపద్మావతి అమ్మవారి శ్రీనామాలు’, ‘మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ శివప్రణయం’, ‘బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి ధార్మిక ఉపన్యాసాలు’, ‘భగవద్గీత 18 అధ్యాయాల ఉపన్యాసాలు’, ‘అన్నమయ్య సంకీర్తన శోభ’ తదితర సిడిలు రూ.30/- చొప్పున అందుబాటులో ఉన్నాయి. ఈ సిడిలు తెలుగు, సంస్కృతం, హిందీ, కన్నడ భాషల్లో భక్తులకు అందుబాటులో ఉన్నాయి.

టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ఆదేశాల మేరకు ప్రజాసంబంధాల అధికారి డా|| టి.రవి పర్యవేక్షణలో ‘పుస్తక విక్రయశాల’ నిర్వహిస్తున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.