HANUMANTA VAHANAM HELD _ – హనుమంతునిపై శ్రీ రాముడు
Tirumala, 17 April 2024: On the occasion of Sri Rama Navami, Hanumanta Vahana Seva was held in Tirumala on Wednesday evening.
Sri Rama took out a celestial ride on His favourite Hanumanta vahana and blessed devotees all along four mada streets.
TTD EO Sri AV Dharma Reddy, TTD officials, devotees were also present.
ASTHANAM HELD
In connection with Sri Rama Navami, Asthanam was held Wednesday evening inside Bangaru Vakili in Tirumala temple on Wednesday evening.
Sri Rama Navami Asthanam was observed between 9pm and 10pm where the episodes of the birth of Sri Rama were recited by the vedic scholars on the occasion.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి ఆస్థానం
– హనుమంతునిపై శ్రీ రాముడు
తిరుమల, 2024 ఏప్రిల్ 17: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీరాములవారు తన భక్తుడైన హనుమంతునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.
హనుమంత వాహనం – భగవత్ భక్తి ప్రాప్తి
హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులైన శ్రీ రామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.
శ్రీరామనవమి ఆస్థానం
అనంతరం రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి దంపతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.